ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Moon: చంద్రుడిపైకి డ్రోన్‌

ABN, Publish Date - Feb 28 , 2025 | 04:22 AM

దీనికి సమాధానం కనుక్కోవటానికి అనేక ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే, తాజాగా ఓ అమెరికా కంపెనీ డ్రోన్‌తో కూడిన ల్యాండర్‌ను చంద్రుడి మీదికి పంపించింది.

నీటి జాడల అన్వేషణ కోసం అమెరికా కంపెనీ ప్రయోగం

జాబిల్లి దక్షిణ ధ్రువం మీద మార్చి 6న దిగనున్న ల్యాండర్‌ అథీనా

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 27: చందమామ మీద నీళ్లున్నాయా?.. ఈ ప్రశ్న దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతూనే ఉంది. దీనికి సమాధానం కనుక్కోవటానికి అనేక ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే, తాజాగా ఓ అమెరికా కంపెనీ డ్రోన్‌తో కూడిన ల్యాండర్‌ను చంద్రుడి మీదికి పంపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి పొడ లేకుండా, ఎల్లప్పుడూ నీడలోనే ఉండే ప్రాంతంలో దిగే ఈ ల్యాండర్‌.. అక్కడ నీటి ఆనవాళ్లపై సమాచారాన్ని అందించనుంది. ఇన్‌ట్యూటివ్‌ మెషిన్స్‌ అనే కంపెనీ రూపొందించిన ఈ ల్యూనార్‌ ల్యాండర్‌ పేరు అథీనా. నాసాకు చెందిన కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి దీనిని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. మార్చి 6వ తేదీన చంద్రుడిపై అథీనా దిగనుంది.



అక్కడ చీకటి లోయలు అనేకం

అథీనా పొడవు 15 అడుగులు. దీంట్లో మూడు అడుగుల పొడవున్న డ్రోన్‌ ఉంది. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కు ఆద్యుడిగా భావిం చే గ్రేస్‌ హోపర్‌ పేరు మీద ఈ డ్రోన్‌కు గ్రేస్‌ అని పేరు పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి 160కి.మీ.ల దూరంలో ఉండే ప్రాంతం లో అథీనా దిగాలనేది నిర్దేశిత లక్ష్యం. ఆ ప్రాంతానికి కేవలం 400 మీటర్ల దూరంలో శాశ్వతంగా నీడలో ఉండే 65 అడుగుల లోతైన భారీ లోయ ఉంది. చంద్రుడి ఉత్తర, దక్షిణధ్రువాల్లో సూర్యరశ్మి సోకని ఇటువంటి భారీ లోయలు అనేకం ఉన్నాయి. ఈ లోయల నిండా నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే నిజమైతే.. ఆ మంచు నుంచి.. భవిష్యత్తులో చంద్రుడి మీదకు వెళ్లే వ్యోమగాములు తాగటానికి అవసరమైన నీటి ని, పీల్చుకోవటానికి గాలిని, ఇంకా వీలైతే రాకెట్ల ఇంధనాన్ని కూడా తయారు చేయాలన్నది శాస్త్రవేత్తల స్వప్నం. అంతరిక్ష ప్రయోగాలనే మలుపు తిప్పే పరిశోధన ఇది. దీనికోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఇన్‌ట్యూటివ్‌ మెషిన్స్‌ చేపట్టిన ప్రయోగం కోసం ఆ కంపెనీకి నాసా 6.2 కోట్ల డాలర్లను చెల్లించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగే అథీనా నుంచి గ్రేస్‌ విడివడి అక్కడి చీకటి లోయపై పరిశోధనలు జరుపుతుంది. అత్యంత శక్తిమంతమైన కెమెరాలు, లేజర్ల సాయంతో గ్రేస్‌ అక్కడి పరిస్థితులను రికార్డు చేస్తుంది. హంగరీ, జర్మనీ అంతరిక్ష పరిశోధన సంస్థలకు చెందిన కొన్ని పరికరాలనూ గ్రేస్‌కు అనుసంధానించారు. సదరు పరికరాలు లోయలో తవ్వకాలు జరిపి మంచు ఆనవాళ్ల కోసం అన్వేషిస్తాయి. చంద్రుడి చీకటి లోయల్లోకి వెళ్లి మరీ పరిశోధనలు జరపటం ఇదే తొలిసారి.



మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 04:22 AM