Share News

Mahakumbh Mela: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ

ABN , Publish Date - Feb 27 , 2025 | 05:35 PM

Mahakumbh Mela: ప్రయాగ్ రాజ్ వేదికగా సాగిన మహాకుంభమేళ.. గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. అలాగే 45 రోజుల పాటు సాగిన ఈ మేళలో విస్తుపోయే వాస్తవాలు చోటు చేసుకున్నాయి.

Mahakumbh Mela: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Maha Khumbhamela

లక్నో, ఫిబ్రవరి 27: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళ.. శివరాత్రి పర్వదినం (జనవరి 26వ తేదీ) వేళ.. భక్తుల శివ నామస్మరణల మధ్య ముగిసింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళ.. దాదాపు 45 రోజుల పాటు సాగింది. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి వచ్చిన దాదాపు 66 కోట్ల మందికి పైగా భక్తులు.. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించి తరించారు.

అయితే ఈ మహాకుంభమేళ మూడు గిన్నిస్ రికార్డులను నమోదు చేసుకొంది. ఈ మహాకుంభమేళలో భాగంగా హ్యాండ్ పెయింటింగ్ నిర్వహించారు. ఇందులో 10,102 మంది పాల్గొన్నారు. వారంత సమైక్యత, సామాజిక సామరస్యం, సమగ్రతలో ఏకత్వం అనే స్ఫూర్తితో తమ భావాలను వ్యక్తపరిచారని మహాకుంభమేళ అధికారిక వర్గాలు తెలిపాయి. లక్షల మందితో ప్రపంచంలోనే అతి పెద్ద యోగాసానాలు వేశారు. లక్షల మంది భక్తులు ఒకే చోట చేరి.. భక్తి స్తోత్రాలను పఠించారు. ఇలా మూడు గిన్నీస్ రికార్డులను నెలకొల్పారు.

ఇక మహాకుంభమేళ ముగిసిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రపంచ చరిత్రలోనే ఇది అపూర్వమైనదని.. ఈ సంఘటన మరపురానిదని అభివర్ణించారు. ఈ మహా కుంభమేళ.. ఇంతటి విజయవంతం కావడానికి దార్శనికులు, సాధువులు, అఘోరాలతోపాటు మత పెద్దల ఆశీర్వాద బలమేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ కుంభమేళ అద్భుతమైన దృశ్యంగా మలిచారన్నారు. తద్వారా మొత్తం ప్రపంచానికి ఐక్యతా సందేశాన్ని ఇచ్చినట్లు అయిందన్నారు.

Also Read: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఆసక్తికర సంఘటన


45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళలో.. ఆరు ప్రత్యేక తేదీలు ఉన్నాయి.. జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29వ తేదీ మౌని అమావాస్య, ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి, ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పూర్ణిమ, జనవరి 26వ తేదీ మహా శివరాత్రిలలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు.

Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్


ఈ మహాకుంభమేళలో విస్తుపోయే వాస్తవాలు..

గంగానదిని నాలుగు ప్రాంతాల్లో ప్రక్షాళన చేయడం రికార్డు సృష్టించింది. ఇందులో 360 మంది పాల్గొని.. శుద్ది చేయడం ఓ రికార్డు.

2019లో జరిగిన కుంభమేళాలో 7,660 మంది పాల్గొన్నారు. ఈసారి భక్తులు లెక్కకు మిక్కిలిగా పాల్గొన్నారు.

కుంభమేళ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌‌లో 19 వేల మంది శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు. తొలుత వారి సంఖ్య 10 వేలు మాత్రమే ఉంది. కానీ వారి సంఖ్యను ప్రభుత్వం భారీగా పెంచింది. అయితే 2019లో నిర్వహించిన కుంభమేళలో వారి సంఖ్య కేవలం 10 వేల మంది మాత్రమే ఈ విధులు నిర్వహించారు. ఇది నాడు గిన్నీస్ రికార్డులో నమోదయింది.

ఈ మహాకుంభమేళ ప్రపంచ అతి పెద్ద ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమమని ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి, ఇంధన శాఖ మంత్రి ఏకే శర్మ తెలిపారు. ఈ మహాకుంభమేళ కార్యక్రమం ఇంతగా విజయవంతమైందంటే.. అందుకు శానిటేషన్ పనివారే కారణమని పేర్కొన్నారు. వీరు నిజమైన హీరలంటూ మంత్రి ఏకే శర్మ అభివర్ణించారు.


ఈ కుంభమేళాకు ప్రతిరోజూ 1.25 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు.

మహాకుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించడానికి దాదాపు 50 లక్షల మందికి పైగా విదేశీయులు ప్రయాగ్ రాజ్ తరలి వచ్చారు. ఇక ఈ మహాకుంభమేళకు విచ్చేసిన భక్తులు.. అమెరిక, చైనా, రష్యాలతోపాటు ఇతర దేశాలల్లోని ప్రజల మించి వీటికి హాజరయ్యారని తెలిపారు.

ఇక మహాకుంభమేళకు ఐదు కోట్ల మంది భక్తులను తరలించేందుకు 16 వేలకుపైగా రైల్వే సర్వీసులను వినియోగించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

For National News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 05:46 PM