China Retaliatory Tariffs on USA: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. అమెరికా దిగుమతులపై చైనా సుంకాల విధింపు
ABN, Publish Date - Mar 04 , 2025 | 01:07 PM
అమెరికా అధ్యక్షుడి సుంకాల విధింపునకు చైనా దీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై10 నుంచి 15 శాతం మేర టారిఫ్‌ను పెంచుతున్న్టు తెజా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు చైనా దీటుగా బదులిచ్చింది. అగ్రరాజ్యం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై విధించే సుంకాలను 10 నుంచి 15 శాతం మేర పెంచినట్టు పేర్కొంది. సవరించిన టారిఫ్‌లు మార్చి 10 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. మొత్తం 25 అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాల భారం పడనుందని సమాచారం. చైనా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్ 20 శాతం పెంచినందుకు ప్రతిగా చైనా కూడా సుంకాల వడ్డింపులకు పూనుకుంది. చైనాతో పాటు మెక్సికో, కెనడా నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు తాజాగా 25 శాతం అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే (China Retaliatory Tariffs on USA:).
‘‘అమెరికా నుంచి దిగుమతయ్యే చికెన్, గోధుమలు, కార్న్, పత్తిపై సుంకాన్ని 15 శాతం మేరకు, సోయా, పోర్క్, బీఫ్, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై సుంకాలను 15 శాతం పెంచుతాము. కొత్త రేట్లు మార్చి 10 నుంచి అమల్లోకి వస్తాయి’’ అని చైనా ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధించడం ప్రపంచ వాణజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమే అని చైనా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో మండిపడింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకారానికి ఇది గొడ్డలి పెట్టు అని పేర్కొంది. తమ హక్కులను ప్రయోజనాలను కాపాడుకునేందుకు గట్టిగా పోరాడతామని వెల్లడించింది.
Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత
ఇక అమెరికా చైనా ఉత్పత్తులపై అదనంగా విధించిన 10 శాతం సుంకాలు నేటి నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో, చైనాపై అమెరికా విధించే మొత్తం టారిఫ్ 20 శాతానికి చేరుకుంది. డ్రగ్స్ కట్టడికి చైనా సరైన చర్యలు తీసుకోలేదంటూ ట్రంప్ ఈ 10 శాతం అదనపు సుంకానికి తెరతీశారు.
ట్రంప్ తొలి పర్యాయం అధ్యక్షుడైనప్పుడే 370 బిలియన్ డాలర్ల దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించారు. బైడెన్ హయాంలో కూడా వీటిల్లో కొన్ని ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. దీంతో, చైనా నుంచి దిగుమతి చేసుకున్న సెమీ కండక్టర్లపై ఇంపోర్టు డ్యూటీలు దాదాపు రెండింతలై 50 శాతానికి చేరుకున్నాయి. చైనా ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలు కూడా నాలుగింతలు పెరిగి 100 శాతాన్ని దాటిపోయాయి.
Withdrawl from NATO: నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకునేందుకు ఇదే సరైన సమయం: ఎలాన్ మస్క్
ఇక అమెరికా తాజాగా విధించిన సుంకం.. సార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, వీడియో గేమ్స్, కన్సోల్స్, స్మార్ట్ వాచ్‌లు స్పీకర్స్, బ్లూటూత్ పరికరాలకు వర్తిస్తుంది. వీటిల్లో కొన్నింటిపై గతంలో ఎలాంటి టారిఫ్‌లు లేవు. ఫెంటనైల్ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకులను చైనా సప్లై చేస్తోందని అమెరికా ఆరోపిస్తుండగా తాము నిర్దోషులమనేది చైనా వాదన.
మరిన్ని అంతర్జాతీయ, వాణిజ్య వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 04 , 2025 | 01:07 PM