ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Treamill Vs Outdoor Waking: ట్రెడ్‌మిల్‌పై నడక కంటే బయట వాకింగ్ చేయడమే బెటరా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

ABN, Publish Date - Feb 25 , 2025 | 09:54 PM

ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై నడకకంటే ఆరు బయట నడకతో అదనపు ప్రయోజాలు ఉన్నాయని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. మరి ఆ అదనపు ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: వాకింగ్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్ట్రెస్ తగ్గడం, ఆయుర్దాయం పెరగడం వంటి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. అయితే, ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై నడక మంచిదా లేదా ఆరుబయట వాకింగ్ మంచిదా అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనక్కుకునేందుకు శాస్త్రవేత్తలు పెద్ద అధ్యయనం నిర్వహించారు. మరి ఈ అధ్యయనంలో తేలిందేంటో తెలుసుకుందాం (Walking Outdoor Vs walking on Treadmill).

ఎకోసైకాలజీ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురితమయ్యాయి. నడకపై పర్యావరణం ఎఫక్ట్ ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆరుబయట నడకతో శరీరంపై ఎక్కువ ప్రభావం ఉంటుందా? భావోద్వేగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు.


Glaucoma: ఒత్తిడితో కూడా గ్లకోమా ముప్పు! కొత్త అధ్యయనంలో వెల్లడి

ఈ అధ్యయనం కోసం మొత్తం 74 మంది యూనివర్సిటీ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపు వారు ఆరుబయట ఉన్న ఫుట్‌పాత్‌పై 600 మీటర్ల మేర నడిచారు. రెండో గ్రూపులోని వారు ఇంట్లోనే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తారు. అయితే, వీరి ముందు బయటవాతావరణంలోని దృశ్యాలను స్క్రీన్‌లపై ప్రదర్శించారు. రెండు గ్రూపులపై ప్రభావాన్ని విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Dance: రోజుకు 20 నిమిషాల డ్యాన్స్‌తో లైఫ్‌లో అద్భుతాలు

ఆరుబయట వాకింగ్ చేసిన వారిలో గుండె కొట్టుకునే వేగం ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై నడిచిన వారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు తగ్గట్టే, ఆరుబయట వాకింగ్ చేసిన వారిలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగినట్టు కూడా తేలింది. అయితే, ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై నడిచిన వారిలో టెన్షన్ బాగా తగ్గితే బయట నడిచిన వారి టెన్షన్‌లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. ప్రశాంతత, అలసట, ఉత్సాహం, సానుకూల దృక్పథం వంటి విషయాల్లో రెండు గ్రూపుల మధ్య పెద్ద వ్యత్యాసాలేవీ కనిపించలేదు. ఫలితంగా, ఆరుబయట నడిస్తే ఓ మోస్తరుస్థాయిలో అదనపు ప్రయోజనాలు చేకూరతాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు అంతేకాకుండా, బయట వాకింగ్ చేసే వారిలో సంతోషం, అంతాబాగుందన్న సానుకూల దృక్పథం వంటివి కాస్త ఎక్కువగా ఉన్నట్టు కూడా గుర్తించారు.

Read Latest and Health News

Updated Date - Feb 25 , 2025 | 10:00 PM