Dance: రోజుకు 20 నిమిషాల డ్యాన్స్‌తో లైఫ్‌లో అద్భుతాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:28 AM
రోజూ కనీసం 20 నిమిషాల పాటు ఇంట్లోనే డ్యాన్స్ చేస్తే జిమ్‌లో కసరత్తులు చేసినంత ఫలితం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

ఇంటర్నెట్ డెస్క్: రోజంతా పని చేసి సాయంత్రం మళ్లీ జిమ్‌లో కసరత్తులు చేయాలంటే చాలా కష్టం. ఇక రాత్రి షిఫ్టుల కారణంగా ఉదయం వేళ కసరత్తులు చేయడం కూడా కొంచెం కష్టమే. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది వాకింగ్ లేదా జాగింగ్‌ను ఎంచుకుంటారు. అయితే, రోజూ 20 నిమిషాల పాటు ఇంట్లో డ్యాన్స్ చేస్తే కసరత్తులతో సమానమైన బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు (Health).
Health: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన 6 పండ్లు
డ్యాన్స్‌తో కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకునేందుకు నార్త్ఈస్టర్న్ యూనివర్శిటీ బోస్టన్‌లో ఓ అధ్యయనం నిర్వహించింది. 18 నుంచి 83 ఏళ్ల మధ్య ఉన్న 48 మందిని వివిధ రకాల డ్యాన్స్‌లు చేయమని చెప్పి ఫలితాలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు రోజుకు 5 నిమిషాల పాటు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో వారు ఎంత ఆక్సీజన్ వాడారో, వారి గుండె కొట్టుకునే తీరు ఏ స్థాయిలో ఉందో తదితర విషయాలను యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. అయితే, ఇలా డ్యాన్స్ చేసిన వారందరికీ ఆ రోజుకు ఒంటికి కావాల్సిన కసరత్తు దక్కినట్టు అధ్యయనకారులు చేశారు.
Water Purifying Tips: ఆర్ఓ ఫిల్టర్ లేని వారు ఈ టిప్స్ పాటిస్తే నీటి కాలుష్యం నుంచి విముక్తి
రోజై తమంతట తాముగా వ్యక్తులు ఓ మోస్తరు వేగంతో డ్యా్న్సులు చేస్తే కసరత్తులు చేసిన ఫలితం లభిస్తుందా లేదా అని తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే, డ్యాన్స్‌తో కసరత్తులు చేసిన ఫలితం కచ్చితంగా లభిస్తుందని ఈ అధ్యయనం తేల్చింది.
‘‘డ్యాన్స్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పైగా ఇది బోరుగా అనిపించదు. దీంతో, జిమ్‌లో కసరత్తులు చేసినంత ఫలితం ఉంటుంది’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యక్తులు వారానికి సగటున 150 నిమిషాలు కసరత్తులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెబుతున్నారు. గంటలకు గంటలు కుర్చీల్లో కూర్చుండిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఫిట్‌గా ఉండాలాంటే వాకింగ్, జాగింగ్, జిమ్‌కు వెళ్లడం లేదా స్విమ్మింగ్ చేయాలన్న అపోహ జనాల్లో ఉంది. అయితే, డ్యాన్స్ లాంటి యాక్టివిటీతో కూడా దాదాపు అదే స్థాయి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..