Health: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన 6 పండ్లు
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:10 PM
30 ఏళ్లు దాటిన మహిళ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా ఆరు రకాల పండ్లు తినాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: వయసు పెరగడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. అయితే, వయసు తగినట్టు పోషకాహారం తింటే పెరిగే వయసు తాలూకు ప్రభావం ఒంటిపై అంతగా కనిపించదు. ముఖ్యంగా మహిళలు 30 ఏళ్ల దాటిన దగ్గర నుంచి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి మంచి పోషకాలు అందేందుకు 30 ఏళ్లు దాటిన మహిళలు తినాల్సిన పండ్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
మధ్యవయసులో వచ్చే సమస్యలను నివారించేందుకు చెర్రీ పండ్లు అత్యంత అవసరం. వారానికి మూడు సార్లు డజన్ చెర్రీ పండ్లు లేదా చక్కెర వేయని చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే మంచి ఫలితంగా ఉంటుంది. యోగర్టుతో కలిపి తింటే మరింత ప్రయోజనకరం.
Water Purifying Tips: ఆర్ఓ ఫిల్టర్ లేని వారు ఈ టిప్స్ పాటిస్తే నీటి కాలుష్యం నుంచి విముక్తి
టమాటాలు పండ్లు కాకపోయినప్పటికీ ఇవి కూడా బెర్రీ జాతికి చెందినవే. ఇందులోని లైకోపీన్ మహిళల ఆరోగ్యానికి అత్యావస్యకం. టమాటాలు బాగా తినే మహిళలు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా కడుపు, ఉపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు టమాటాలు తినడం అవసరం.
బొప్పాయి పండ్లలో విటమిన్ ఏ, సీ, ఫోలేట్ ఇతర ఫైటో కెమికల్స్ అత్యధికంగా ఉంటాయి. ఇందులోని పపెయిన్ అనే రసాయనం జీర్ణక్రియ మెరుగుపడేందుకు కీలకం. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో అధికంగా ఉండే బీటా కెరోటీన్‌తో షుగర్, హృదయసంబంధిత సమస్యలు దరిచేరవు.
Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..
జామ పండ్లతో శరీరానికి కావాల్సిన విటమిన్ సీ పుష్కలంగా అందుతుంది. జామతో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉండటంతో పాటు ఇందులోని పొటాషియం, పీచు పదార్థం గుండెకు మేలు చేస్తాయి. నెలసరి సమస్యలకు కూడా జామ మంచి పరిష్కారం.
ఏ వయసువారైనా తినదగిన పండ్లు యాపిల్. ఇందులోని పెక్టిన్ అనే పీచు పదార్థం ఆహారంలోని కొవ్వు శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో ఆకలి తక్కువగా వేస్తుంది. ఫలితంగా ఆహారం తీసుకోవడం తగ్గి బరువు అదుపులో ఉంటుంది. క్రమం తప్పకుండా యాపిల్ తినే వాళ్లంల్లో రక్తనాళాల సమస్యల ముప్పు 22 శాతం మేర తగ్గినట్టు ఓ అధ్యయనంలో తేల్చింది.
మధ్యాహ్న భోజనంలో రోజూ సగం ఆవకాడో తినే వారిలో ఆ తరువాత ఆకలి వేయడం దాదాపు 40 శాతం మేర తగ్గుతుందట. ఈ పండులో మోనోఅన్‌శాట్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయి. దీంతో, ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్ తగ్గి వయసు ప్రభావం తక్కువవుతంది.