Share News

Glaucoma: ఒత్తిడితో కూడా గ్లకోమా ముప్పు! కొత్త అధ్యయనంలో వెల్లడి

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:51 PM

ఒత్తిడి కారణంగా శరీరంలో పెరిగే కార్టిసాల్‌ హార్మోన్‌తో గ్లకోమా ముప్పు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

Glaucoma: ఒత్తిడితో కూడా గ్లకోమా ముప్పు! కొత్త అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్: అదుపులో లేని డయాబెటిస్ వ్యాధి కారణంగా గ్లకోమా వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడితో కూడా గ్లకోమా ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది (Health).

ఏమిటీ గ్లకోమా..

కంటిలోని ఆప్టిక్ నర్వ్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు అది దెబ్బతింటుంది. ఫలితంగా శాశ్వతంగా చూపు కోల్పోవాల్సి వస్తుంది. జీవనశైలి వ్యాధి కారణంగా కంటిలో ఒత్తిడి పెరిగినప్పుడు ఆప్టిక్ నాడి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితిని అదుపులో ఉంచొచ్చు.

Dance: రోజుకు 20 నిమిషాల డ్యాన్స్‌తో లైఫ్‌లో అద్భుతాలు


ఇక తాజా అధ్యయనం ప్రకారం, ఒత్తిడికి, ఆందోళన, గ్లకోమాకు కూడా సంబంధం ఉన్నట్టు తేలింది. ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగి కంటిలోని ఒత్తిడి అధికమవుతుందట. కార్టిసాల్ పెరిగితే గుండె కొట్టుకునే వేగం, బీపీ పెరుగుతుందన్న విషయం తెలిసిందే. వీటితో పాటు కంటిలోని ఒత్తిడి కూడా పెరుగుతుందట. ఇలా పలుమార్లు ఒత్తిడి హెచ్చుతగ్గుల అయినప్పుడు కంట్లోని ఆప్టిక్ నర్వ్‌పైనా ప్రభావం పడుతుంది. నిత్యం ఒత్తిడిపై అదుపు లేకపోతే క్రమంగా ఆప్టిక్ నాడి దెబ్బతింటుంది.

Health: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన 6 పండ్లు

ఇక ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్ర పోవడం కూడా తగ్గిపోతుంది. జీవనశైలి కూడా అస్థవ్యస్థంగా మారుతుంది. ఇవన్నీ ఆప్టిక్ నర్వ్‌పై ఒత్తిడి పెంచి గ్లకోమాకు దారితీస్తాయి. ఇక గ్లకోమా భయం నిరంతరం వెంటాడుతూ మానసిక కుంగుబాటు కలుగి ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇలా ఒక విషవలయం మొదలై అందులోంచి బయటపడటం కష్టంగా మారిపోతుంది. నిద్ర కరువైతే కంటిలో ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారా నియమాలు పాటించకపోవడం, ధూమపానం, కసరత్తులు చేయకపోవడం, మద్యపానం వంటవన్నీ ఒత్తిడిని పెంచి గ్లకోమా ముప్పును పెంచుతాయి.

Water Purifying Tips: ఆర్ఓ ఫిల్టర్ లేని వారు ఈ టిప్స్ పాటిస్తే నీటి కాలుష్యం నుంచి విముక్తి


అయితే, ఒత్తిడి అదుపు తప్పకుండా చూసుకోవడమే ముందున్న ఏకైక ప్రత్యామ్నాయ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా, సైకలాజికల్ కౌన్సెలింగ్ తీసుకవడం వంటివన్నీ ఒత్తిడిని జయించేందుకు తోడ్పడతాయి. అంతిమంగా గ్లకోమా దరిచేరకుండా కాపాడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..

Read Latest and Health News

Updated Date - Feb 24 , 2025 | 03:51 PM