ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aloe vera for Bald Patches: నెత్తిపై జుట్టు ప్యాచులుగా ఊడిపోతోందా? కలబందను ఇలా వాడితే..

ABN, Publish Date - Mar 08 , 2025 | 10:59 AM

ఆలోవీరాను ఇలా వాడితే జుట్టు పలచబడటాన్ని సులువుగా నిరోధించవచ్చు. ఇదెలా ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Aloe vera gel for bald patches

ఇంటర్నెట్ డెస్క్: అలోవీరా లేదా కలబందలోని ఔషధ గుణాలు బోలెడన్ని ఉన్నాయి. చర్మం, కేశ సంబంధిత ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వినియోగిస్తారు. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, డాండ్రఫ్ తగ్గించేందుకు, నెత్తిపై చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఆలోవీరా ఉపయోగపడుతుంది. ఇక నెత్తిపై అక్కడక్కడా జుట్టు ఊడిపోయిన వారికి తిరిగి కేశాలు పెరిగేందుకు ఆలోవీరా దోహదపడుతుంది. ఊడిన చోటు జుట్టు మొలిపించేందుకు కలబందను ఎలా వినియోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం ;(Aloe vera for Bald Patches).

Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే రక్త హీనత ఉన్నట్టే..


అలోవీరా ఔషధగుణాలు

కలబందంతో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కేశ సౌందర్యానికి అవసరమైన విటమిన్ ఏ, సీ, ఈ, బీ12తో పాటు ఇతర ఖనిచాలు, అమైనోయాసిడ్స్, ఎంజైములు ఉంటాయి. ఇవన్నీ నెత్తిపై చర్మా్న్ని పునరుత్తేజితం చేసి జుట్టు పెరిగేలా చేస్తాయి. జుట్టు కుదుళ్లను కూడా ప్రేరేపించి బట్టతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జుట్టు పలచబడటానికి ఇన్‌ఫ్లమేషన్, దురద కూడా ఒక కారణం. వీటి నుంచి ఆలోవీరాతో ఉపశమనం పొందొచ్చు. ఇక ఆలోవీరాతో చర్మంపై పీహెచ్ సమతౌల్యం కూడ చేకూరుతుంది. దీంతో, జుట్టు మళ్లీ పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కలబందలోని ఫంగస్ నిరోధక గుణాలు డాండ్రఫ్‌కు కూడా చెక్ పెట్టగలుగుతాయి. ఈ ప్రయోజనాలన్నీ ఆలోవీరా జెల్‌తో పూర్తి స్థాయిలో పొందొచ్చు.

Copper Bottles Vs Steel Bottes: స్టీల్ నీళ్ల బాటిల్స్ కంటే రాగి నీళ్ల బాటిల్స్ ఆరోగ్యకారకమా

నెత్తిపై అక్కడడక్కా జుట్టు ఊడిపోతుంటే..

నెత్తిపై ప్యాచులుగా జుట్టు ఊడిపోతున్న వారికి ఆలోవీరా జెల్‌తో మంచి పరిష్కారం లభస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలోవీరా జెల్‌ను జుట్టు పలచపడుతున్న ప్రాంతంలో మర్దనా చేస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. అలోవీరా జెల్ మార్కెట్‌లో లభిస్తుంది. అయితే, ఎటువంటి అడిటివ్స్ లేని ఆర్గానిక్ కలబంద జెల్‌ను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

లేదనంట కలబంద నుంచి తాజాగా రెడీ చేసుకోవచ్చు. ఇక కలబంద నుంచి జెల్ సిద్ధం చేసుకునేటట్టైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


ముందుగా ఆలో వీరా ఆకును తీసుకుని దానిపై చెక్కును తీయాలి. ఆ తరువాత స్పూన్ లేదా కత్తితో లోపలున్న జెల్‌ను బయటకు తీసాయి. పాక్షిక పారదర్శకంగా ఉన్న జెల్‌ను మాత్రమే తీసుకోవాలి.

నెత్తికి ఆలోవీరా జెల్‌ను మర్దను చేసుకునే ముందు నెత్తిపై ఉన్న దుమ్ముధూళి పోయేలా కాగా కడగాలి. ఇందుకోసం మైల్డ్ షాంపు వాడొచ్చు. జుట్టు కడుక్కు్న్నా మెత్తని టవల్‌తో ఆరబెట్టుకోవాలి. నెత్తిపై నీరు మొత్తం పోయాక జెల్‌ను తీసుకుని మునివేళ్ళతో జుట్టు పలుచబడుతున్న ప్రాంతంలో బాగా రుద్దాలి. ఆ తరువాత జెల్‌ను నెత్తిపై అలాగే గంట సేపు ఉండనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చూస్తుండగానే జుట్టు పలచబడటం తగ్గి కొత్త వెంట్రుకలు మొలుస్తాయి.

Read Latest and Health News

Updated Date - Mar 08 , 2025 | 11:00 AM