Copper Bottles Vs Steel Bottes: స్టీల్ నీళ్ల బాటిల్స్ కంటే రాగి నీళ్ల బాటిల్స్ ఆరోగ్యకారకమా
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:06 PM
రాగి వాటర్ బాటిల్ కొనాలా లేక కాపర్ వాటర్ బాటిల్ కొనాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..

ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలం మొదలైంది. ఈ కాలంలో తగినంత నీరు తాగకపోతే సమస్యలు తప్పవు. ఇక బయటకు వెళ్లే వాళ్లు తమ వెంట నీళ్ల బాటిల్స్ తీసుకెళ్లక తప్పదు. ఇలాంటప్పుడు చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించేందుకు వెనకాడతారు. ఇందుకు బదలు స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగి బాటిల్స్‌ను ఎంచుకొంటారు. అయితే ఈ రెండింట్లో ఏది బెటర్ అనే సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. ఈ ప్రశ్నకు సవివరమైన సమాధానం ఈ కథనంలో తెలుసుందాం (Steel Bottles Vs Copper Bottles).
రాగి పాత్రలకున్న ఔషధ గుణాలు ఆయుర్వేదం ఎప్పుడో వర్ణించింది. రాగి పాత్రల్లో నీటిని దాదాపు 8 గంటల పాటు నిల్వ ఉంచితే ఈ ఖనిజం నీటిలో స్వల్ప స్థాయిలో కలుస్తుంది. దీంతో, రాగి పాత్రల్లోని నీరు అద్భుత ఔషధ గుణాలు సంతరించుకుంటాయి.
Orange: నారింజతో ఇలాంటి ప్రయోజనం కూడా ఉందా..
రాగికి సూక్ష్మక్రిములను నిర్వీ్ర్యం చేసే శక్తి ఉంది. దీంతో, రాగి పాత్రల్లోని నీరు ఎటువంటి అనారోగ్యాలను కలుగజేయదు. ఈ నీటి కారణంగా జీర్ణ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. జీర్ణరసాలు సమృద్ధిగా తయారవుతాయి. పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును కూడా రాగి మెరుగుపరుస్తుంది. హార్మోన్ల సమతౌల్యత కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాగి పాత్రల్లోని నీరు ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేసి ఆక్సిడేటిట్ స్ట్రెస్ తగ్గిస్తుంది. మెదడు పనితీరును కీలకమైన న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీకి రాగి కీలకం. అయితే, రాగి బాటిల్స్ వాడే వాళ్లు వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
Health Benefits of Fruits: రోజూ ఓ చిన్న గిన్నెడు పండ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
రాగి పాత్రలకున్న ఔషధ గుణాలు స్టీల్ బాటిల్స్‌లో లేకపోయినప్పటికీ ఇందులోని నీరు చాలా కాలం పాటు శుభ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీరు హానికారక రసాయనాలతో కలుషితమవుతాయి. కానీ స్టీల్ బాటిల్స్‌కు ఈ బెడద ఉండదు. స్టెయిన్‌లెస్ట్ స్టీల్ నీటిని ఏరకంగానూ ప్రభావితం చేయదు కాబట్టి ఇందులో నిల్వ ఉంచిన నీటి రుచి ఎక్కువ కాలం పాటు అలాగే నిలిచి ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలకు కరోషన్ సమస్య కూడా ఉండదు కాబట్టి చాలా కాలం పాటు ఇవి మన్నికగా ఉంటాయి. కొన్ని బాటిల్స్ లోపలి గోడల్లో ఇన్సూలేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇందులోని నీరు ఒకే ఉష్ణో్గ్రత వద్ద ఎక్కువ సేపు నిల్వ చేసుకోవచ్చు. స్టెయిన్‌లెస స్టీల్‌ను పూర్థిస్థాయిలో పునర్వినియోగించుకోవచ్చు కాబట్టి ఇది పర్యావరణ హితమైనది కూడా.
Green Grapes Vs Black Grapes: ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏటంటే..