ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health News: లైంగిక సమస్యలతో బాధపతున్నారా.. వీటితో మీ సమస్య పరార్..

ABN, Publish Date - Jan 28 , 2025 | 09:03 AM

పురుషాంగం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బి-12, విటమిన్ డి, విటమిన్ ఇ ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి పురుషాంగానికి రక్త ప్రసరణ పెరిగేలా చేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయని అంటున్నారు.

Health benefits of Vitamins

ఇంటర్నెట్ డెస్క్: దాంపత్య జీవితంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేందుకు రతి అనేది చాలా కీలకం. ఇద్దరూ ఎంత సంతోషంగా జీవిస్తున్నప్పటికీ వారి మధ్య సంతృప్తికరమైన శృంగారం లేకపోతే ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ వారిని వేధిస్తుంటుంది. దీంతో వారి మధ్య గొడవలు మెుదలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మంది పురుషులు.. మహిళల లైంగిక కోరికలు తీర్చే విషయంలో విఫలం అవుతుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. అంగం బలహీనం, అంగస్తంభన వంటి సమస్యలు ఇందుకు కారణం. అయితే మూడు రకాల విటమిన్లు ఆ సమస్యను దూరం చేస్తాయని మీకు తెలుసా.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పురుషాంగం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బి-12, విటమిన్ డి, విటమిన్ ఇ ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి పురుషాంగానికి రక్త ప్రసరణ పెరిగేలా చూసి దాని పనితీరును మెరుగుపరుస్తాయని అంటున్నారు. అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిలు సైతం పెంచుతాయని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజూ తినడం వల్ల శరీరానికి ఈ మూడు విటమిన్లు పుష్కలంగా అందుతాయని, పురుషులు గతంలో కంటే మెరుగ్గా శృంగారంలో రాణిస్తారని అంటున్నారు.


విటమిన్ బి12 లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. ఈ విటమిన్‌లోని గుణాలు పురుషాంగానికి రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేస్తుంది. పురుషాంగ కణాలకు శక్తిని ఇస్తుంది. లైంగిక సామర్థ్యానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ బి 12 లోపిస్తే పురుషాంగం బలహీనంగా మారి లైంగిక సమస్యల తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది. మరోవైపు నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేసేలా చేస్తుంది. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్‌గా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.


విటమిన్ డి అనేది పురుషాంగ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఈ విటమిన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. పురుషాంగానికి బలం, శక్తిని ఇస్తుంది. దానికి రక్త సరఫరా మెరుగయ్యేలా చేస్తుంది. తద్వారా మెరుగైన శృంగారం అనుభవించేందుకు దోహదపడుతుంది. అలాగే శరీరంలో క్యాల్షియం, భాస్వరం శోషణకు దోహదపడుతుంది. సూర్యరశ్మి, గుడ్లు, చేపలు, పాలు, పుట్టగొడుగులు తినడం ద్వారా విటమిన్ డిని పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.


విటమిన్ ఇ.. పురుషుల్లో లైంగిక కోరికలు ప్రేరేపిస్తుంది. పురుషాంగం శక్తిని పెంచి పని తీరు మెరుగయ్యేలా సహాయపడుతుంది. దాని కణాలకు బలాన్ని ఇచ్చి ఎక్కువ సేపు రతిలో పాల్గొనేలా చేస్తుంది. పురుషాంగానికి మెరుగైన రక్త ప్రసరణ అందేందుకు విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. ఈ విటన్ పొందేందుకు తరచుగా గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, పాలకూర, అవకాడో తినాలని వైద్యులు చెబుతున్నారు. ఈ మూడు విటమిన్లతో ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఆశ్వాదించాలని సూచిస్తున్నారు.

Updated Date - Jan 28 , 2025 | 12:58 PM