ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Group 1 Results Out: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్..

ABN, Publish Date - Mar 10 , 2025 | 03:19 PM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది. మంగళవారం నాడు గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనుంది టీజీపీఎస్సీ. ఎన్నో అవాంతరాల తరువాత ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

Telangana Group 1 Results Out

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను ప్రకటించింది. మంగళవారం నాడు గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనుంది టీజీపీఎస్సీ. ఎన్నో అవాంతరాల తరువాత ఎట్టకేలకు గ్రూప్ 1 ఫలితాలు విడుదలవడంతో.. అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

గ్రూప్ 1 ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

గ్రూప్ 1 పరీక్ష రాసి.. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు తమ ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.


ఎట్టకేలకు ఫలితాలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి.. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇంతలో గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు నిర్ధారణ అవడంతో.. ఆ ఎగ్జామ్‌ను రద్దు చేశారు. ఆ తరువాత 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా.. నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పరీక్షను రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో ఆ పరీక్ష కూడా రద్దయ్యింది. ఆ తరవాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60 పోస్టులను కొత్తగా కలిపి మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తరువాత ప్రిలిమ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించడం చకచకా జరిగిపోయింది. ఇప్పుడు ఫలితాలను ప్రకటించింది టీజీపీఎస్సీ.

ఇకపోతే.. 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా.. మెయిన్స్ ఎగ్జామ్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక మంగళవారం నాడు గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనున్నారు. 20వ తేదీలోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.

Updated Date - Mar 10 , 2025 | 04:09 PM