ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘‘జీవితంలోంచి వచ్చిన కథలే కాలంతో పాటు నిలుస్తాయి.’’

ABN, Publish Date - Jan 27 , 2025 | 01:26 AM

జీవితాల చుట్టూ తిరుగుతూ, ఆ జీవితాల్లోని ఈతి బాధలను చూపి స్తాయి. కథల్లోని పాత్రలతో మనల్ని మనం పోల్చుకుంటాం. పాతతరం రచయితల్లో మిగిలిన ఒకరిద్దరిలో ఆయన ఒకరు....

గంధం యాజ్ఞవల్క్య శర్మ కథలన్నీ మధ్య తరగతి జీవితాల చుట్టూ తిరుగుతూ, ఆ జీవితాల్లోని ఈతి బాధలను చూపి స్తాయి. కథల్లోని పాత్రలతో మనల్ని మనం పోల్చుకుంటాం. పాతతరం రచయితల్లో మిగిలిన ఒకరిద్దరిలో ఆయన ఒకరు. వాకాటి పాండు రంగారావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, బీనా దేవి వంటి రచయితలు ఆయన సమకాలికులు. 1937 ఆగస్టు 16న సీతాపతి శర్మ, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మిం చారు. చదువు లింగంగుంట్ల, మాచర్ల, బాపట్ల, అమలాపురం, గుంటూరు ఇలా పలుచోట్ల సాగింది. 1958లో కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి, 1995లో నరసరావుపేటలో సబ్ రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. 170 కథలు, అరడజను నవలలు, కొన్ని నవలికలు, రేడియో నాటికలు రాశారు.

ఇంటర్వ్యూ : కరీం

99667 57407

గంధం యాజ్ఞవల్క్య శర్మ


మీ సాహితీ ప్రస్థానం ఎలా మొదలైంది?

మా తండ్రి గంధం సీతాపతి గారు కవి, పండితులు. మా పెద్దన్న గంధం వెంకా స్వామి శర్మ 1950వ దశకంలో చైతన్య పేరుతో మంచి కథలు రాశారు. ఆ వాతావరణం నాకు ఆసక్తి కలిగించి రచనా వ్యాసంగం వైపు రావడానికి దోహదం చేసింది. బీఎస్సీ చదువుతున్నప్పుడు ‘గుంటూరు గోల’ అనే కథ రాశాను. ఆంధ్ర పత్రికలో ప్రచురితమైంది. అది నా మొదటి రచన. మిత్రులు వాకాటి ప్రోత్సాహంతో కథలు, నవలలు, నవలికలు రాశాను. మధ్యలో కొంత కాలం రాయడం ఆపేసాను. మిత్రులు రచన శాయి నాచే మళ్ళీ రాయించారు. ఇప్పుడు వార్ధక్యం వల్ల పూర్తిగా రాయడం ఆపేసాను.


మీ కథలు ఎక్కువ మధ్య తరగతి జీవితాల్లోంచి వచ్చినవే అయ్యుంటాయి ఎందుకు?

నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఆ జీవితాలను, వ్యక్తులను దగ్గరగా చూశాను. వాళ్ళ సాధక బాధలను గమనించేవాణ్ణి. అవే ఇతివృత్తాలుగా కథలు రాశాను. అప్పట్లో పాఠకులు ఎక్కువగా మధ్య తరగతికి చెందిన వారే కావడంతో నా కథలు కనెక్ట్ అయ్యాయి అనుకుంటాను. నేను ప్పుడూ కల్పించి కథలు రాయలేదు. జీవితంలోంచి వచ్చిన కథలే కాలంతో పాటు నిలుస్తాయని నమ్ముతాను. నాకు బాగా పేరు తెచ్చిన ‘సెలవయింది’ కథ నిజ జీవిత ఘటన ఆధారంగా రాసిందే. చిన్నతనంలో మా ఊర్లో రాజు గారని పండరి భజన కళాకారుడు ఉండేవాడు. పండుగలకు, పబ్బాలకు గుళ్ళో పండరి భజన ప్రదర్శించే వాడు. ఆయన ప్రదర్శన చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి జనం వచ్చేవారు. అంత పేరు. కాలక్రమంలో ఆ కళ నిరాదరణకు గురి కావ డంతో చివరి రోజుల్లో దుర్భర పరిస్థితులు అనుభవించాడు. ఒకనాడు గుంటూరులో మా ఇంటికి వస్తే మా అమ్మ భోజనం పెట్టి, కొంత డబ్బిచ్చింది. ఆయన దుస్థితి చూసి చలించిపోయి, ఆయన పాత్రతో కథ రాశాను. ఈ కథను త్రివేణి పత్రిక సంపాద కులు కోలవెన్ను రామ కోటే శ్వర రావుగారు మెచ్చుకో వడం నాకు దక్కిన గొప్ప ప్రశంస. బుచ్చి బాబు, మధురాంతకం రాజారాం నా అభిమాన రచయితలు.


కొలవెన్ను రామ కోటేశ్వరరావు గారితో మీ సాంగత్యం ఎలా సాధ్యమైంది?

ఇప్పటి తరం వాళ్లకు వారి గురించి తెలీదు. వారు స్వాతంత్ర్య సమర యోధులు. స్వాతంత్ర్యానికి పూర్వం పల్నాడు ప్రాంత శాసన సభ్యులుగా ఉన్నారు. బందరు జాతీయ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేశారు. వారి సంపాదకత్వంలో ‘త్రివేణి’ పత్రిక వెలువడింది. నెహ్రూ, సర్వేపల్లి, సరోజినీ నాయుడు వంటి ప్రముఖులు కూడా ‘త్రివేణి’కి రచనలు పంపేవారు. నేను ఉద్యోగ రీత్యా నరసరావుపేటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, మా తండ్రి గారికి ఈ విషయం చెబితే, ఆయన ‘అక్కడ మా గురువు కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు వుంటారు వారిని కలిసి సాష్టాంగ నమస్కారం చేయ’మన్నారు. నరసరావుపేటకు వెళ్ళినప్పుడు వారిని కలిశాను. ఫలానా వారి అబ్బాయిని అని చెప్పా. అప్పటి నుండి వారు చనిపోయేవరకు మా అనుబంధం కొనసాగింది. వారి సాంగత్యంలో నేనెంతో నేర్చుకున్నాను. ఆయనను కలవడానికి వచ్చిన ప్రముఖులెందరినో చూడగలి గాను. కంటి చూపు మందగించటంతో ఎన్నో ఇంగ్లీష్ పుస్తకా లను ఆయనకు చదివి వినిపించే వాణ్ణి. ఆ క్రమంలో నా ఇంగ్లీష్ ఎంతో మెరుగైంది. వారి సాంగత్యం నా పూర్వజన్మ సుకృతం.


మీకు సాహిత్యంలో రావల్సిన గుర్తింపు రాలేదు. ఎందుకంటారు?

నేను పుంఖాను పుంఖాలుగా రాసిన వాణ్ణి కాదు. సంఘట నలకు స్పందించి మాత్రమే రాశాను. స్వభావ రీత్యా నేను అంతర్ముఖంగా వుంటాను. సాహిత్యంలో గుర్తింపు రావాలంటే చొరవ ముఖ్యం. అది నాకు తక్కువ. పైగా ఉద్యోగరీత్యా వచ్చి నేను నరసరావుపేటలోనే స్థిరపడిపోయాను. సాహిత్య సభలు, సమావేశాలు నగర కేంద్రంగా జరుగుతాయి. అలాంటప్పుడు నన్ను ఎవరు పట్టించుకుంటారు. గుర్తింపును నేనెప్పుడూ ఆశించలేదు. అందుకే రాలేదన్న భాధా లేదు.

మీ అబ్బాయి నాగరాజు గంధం గురించి చెప్పండి?

మా అబ్బాయి నాగరాజు గంధం మరణం నాకు తీరని లోటు. మంచి చదువరి. అతని కల్పన శక్తి అమోఘం. నాగరాజు మొదటి కథ ‘చెరువు’కు ఎంతో పేరు వచ్చింది. ఆంగ్లంలోకి అనువదించబడింది. ఆ తర్వాత చాల కథలు, నవలలు రాశాడు. నాటకాలు, నాటికలు రాశాడు. నంది బహుమతుల వచ్చాయి. సినీ దర్శకులు క్రిష్‌తో కలిసి ‘గమ్యం’ సినిమా చేశాడు. ఆ సినిమా మా అబ్బాయికి, క్రిష్‌కు తొలి ప్రయత్నమే. ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. నాగరాజు సంభాషణలకు గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ‘ఇంకోసారి’, ‘బాణం’, ‘గాయం–2’, ‘బెట్టింగ్ బంగార్రాజు’ సిని మాలకు మాటలు అందించాడు. సినిమా రంగంలో నిలదొక్కు కుంటున్నాడని అనుకుంటున్న తరుణంలో మాకు విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు. నాకు సాహిత్యంలో పెద్దగా గుర్తింపు రాలేదు గాని, గంధం నాగరాజు తండ్రిగా నన్ను చాలామంది గుర్తించారు. ఇప్పటికీ ఎవరైనా నాకు నేను పరిచయం చేసుకున్నప్పుడు స్పందించిన దాని కంటే, మా అబ్బాయి పేరు చెప్పగానే ‘‘మీరు నాగరాజు ఫాదరా!’’ అంటూ ఆశ్చర్యంగా స్పందిస్తుంటారు.


ప్రస్తుతం కథా సాహిత్యంపై మీ అభిప్రాయం?

ఇంటర్నెట్, ప్రపంచీకరణ నేపథ్యంలో కథా సాహిత్యం ఇతివృత్తం లోనూ, శైలిలోనూ ఉన్నత స్థాయిలో వుంది. ఖదీర్ బాబు, కుప్పిలి పద్మ, సుజాత వేల్పూరి, కల్పన రెంటాల వంటి కథకులు తమకే ప్రత్యేకమైన శైలిలో గొప్ప కథలు రాస్తున్నారు. ఈ తరం తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల సాహిత్యం చదువు తుండటం అభినందించదగ్గ విషయం. ఎక్కువ చదివి తక్కువ రాయమని కొత్తగా రాసేవాళ్ళకు నా సలహా.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..

Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..

Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్‌ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 27 , 2025 | 01:26 AM