Lord Durga Avatars: అమ్మలగన్న అమ్మ.. జగత్‌కల్పవల్లి అవతారాలు - పరిహారాలు
ABN, Publish Date - Sep 22 , 2025 | 06:31 AM
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
"దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరం సుఖం"
రూపం దేహి జయం దేహి
యశో దేహి ద్విషో జహి
దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మెుదటిరోజు సందర్భంగా అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ మేరకు భక్తులు ఇప్పటికే ఆలయాలకు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకుంటున్నారు.
అమ్మలగన్న అమ్మ, పెన్నిదిలిచ్చేడి లక్ష్మి, పేర్వడ్డ అనాదిశక్తి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా సర్వం శక్తిమయం జగత్ అన్న చందాన అందర్ని రక్షించే అమృతవల్లి. తల్లిలా లాలిస్తుంది. తండ్రిలా పోషిస్తుంది. గురువులా మార్గాన్ని చూపుతుంది. శరణ శరణోయమ్మ, శరణు శరణు అంటే చాలు సమస్త సంపదల్ని ప్రసాదించే దుఃఖ వినాశిని అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు దసరా శరన్నవరాత్రులు ప్రతి దేవాలయాల్లోనూ, గృహాలలో నిర్వహించే సంప్రదాయం మనది. ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కొక్క అలంకారంతో దర్శించి ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
లలితా సహస్రనామ పారాయణ. శ్రీచక్రార్చన, దేవీ ఖడ్గమాల స్తోత్రపారాయణ, చండీయాగాదులు నవరాత్రి సందర్భంగా ఆచరిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. సర్వ జావళికి సుఖ సంతోషాలు కల్గుతాయి. ఈ దసరా సమయాన వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో విశేషంగా రాణించడానికి ధన ప్రాప్తి కలగడానికి, అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి ప్రత్యేక విధి విధానాలతో పూజించాలి. అమ్మవారికి సంబంధించిన సులభమైన పూజా విధానాలు అనుసరించడం ద్వారా కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది.
బాలాత్రిపుర సుందరి..
లలితా అమ్మవారి హృదయం నుంచి 9 సంవత్సరాలు కన్యగా బాలత్రిపుర సుందరి భండాసురుడనే రాక్షసుని కుమారులని సంహరించడానికి ఆవిర్భవించింది. బాలామంత్రం సమస్త మంత్రాలలో గొప్పది. శ్రీవిద్యా ఉపాసకులు మొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. బాలా మంత్రం చేసిన వారే శ్రీచక్రార్చనకు అర్హులు. వరద అభయహస్తాలతో బాలాదేవి సాధకుని విద్యార్థులు ఈ రోజు బాల త్రిపురసుందరి అమ్మవారిని దర్శించి చామంతి పూల మాల సమర్పించి బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పిస్తే పది మందికి ఆ ప్రసాదం పంచితే విద్యలలో విశేషంగా రాణిస్తారు. ఎర్రటి మందార పూలతో అమ్మారిని అర్చిస్తే అంతఃశత్రువులు నశిస్తారు. స్థిరమైన ఆదాయం వస్తుంది.
డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్.
దేవీ ఉపాసకులు అమరావతి.
హస్త ముద్రికి సామ్రాట్
ఫోన్ నెంబర్: 8008004596
Updated Date - Sep 22 , 2025 | 11:13 AM