Hyderabad: విల్లాల్లో సదుపాయాలు కల్పిస్తానని మోసం.. మహిళ అరెస్ట్
ABN, Publish Date - Jan 31 , 2025 | 06:51 AM
విల్లాల్లో సదుపాయాలు కల్పిస్తానని డబ్బులు దండుకొని, ముఖం చాటేసిన మహిళను దుండిగల్(Dundigal) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లంపేటలో 2018లో గుర్రం విజయలక్ష్మి శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మీ మాగ్నస్ కన్‌స్ట్రక్షన్స్, భవన జీఎల్‌సీ పేర్లతో సర్వే నంబర్లలో 170/3, 170/4, 170/4/ఎ, 150, 120,200,300 ప్లాట్లు చేసి అమ్మింది.
హైదరాబాద్: విల్లాల్లో సదుపాయాలు కల్పిస్తానని డబ్బులు దండుకొని, ముఖం చాటేసిన మహిళను దుండిగల్(Dundigal) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లంపేటలో 2018లో గుర్రం విజయలక్ష్మి శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మీ మాగ్నస్ కన్‌స్ట్రక్షన్స్, భవన జీఎల్‌సీ పేర్లతో సర్వే నంబర్లలో 170/3, 170/4, 170/4/ఎ, 150, 120,200,300 ప్లాట్లు చేసి అమ్మింది. ఈ విల్లాల్లో స్విమ్మింగ్ పూల్, యోగాహాల్, ఇన్‌డోర్, అవుట్‌డోర్ మొదలైన సౌకర్యాలు కల్పిస్తామని, సుమారు 200మంది సభ్యుల వద్ద డబ్బులు దండుకొని కనీసం డ్రైనేజీ, నీటి, కరెంట్ మీటర్లు, కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు కూడా కల్పించలేదు.
ఈ వార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
దీంతో బాధితులు 2024 జనవరిలో ఒకసారి, నవంబరు 24న మరోసారి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి గుర్రం విజయలక్ష్మి తప్పించుకుతిరుగుతున్నారు. బుధవారం రాత్రి ఆమె ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నట్లు దుండిగల్ పోలీసులకు సమాచారం రావడంతో ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి(SI Rammohan Reddy) సిబ్బందితో నిఘాపెట్టి ఆమెను అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విజయలక్ష్మిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధితులు పోలీ్‌సస్టేషన్ ముందు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News
Updated Date - Jan 31 , 2025 | 06:51 AM