ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Roller: వార్నీ.. వీళ్లు ఏకంగా ‘రోడ్‌ రోలర్‌’నే దొంగిలించేశారుగా..

ABN, Publish Date - Feb 28 , 2025 | 12:29 PM

మరమ్మతులకు గురై రోడ్డు పక్కన నిలిపిన రోడ్‌ రోలర్‌(Road Roller)ను ఎత్తుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. షేనాయ్‌ నగర్‌(Shenoy Nagar)కు చెందిన దినకరన్‌, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

- వింత దొంగలు !

- ‘రోడ్‌ రోలర్‌’ చోరీ

చెన్నై: మరమ్మతులకు గురై రోడ్డు పక్కన నిలిపిన రోడ్‌ రోలర్‌(Road Roller)ను ఎత్తుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. షేనాయ్‌ నగర్‌(Shenoy Nagar)కు చెందిన దినకరన్‌, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థకు చెందిన రోడ్‌ రోలర్‌ను, మీంజూరు ప్రాంతంలో రోడ్డు నిర్మాణపనులకు వినియోగించారు. పనులు ముగిసిన తర్వాత సెప్టెంబరు 15వ తేది రోడ్‌ రోలర్‌ను మళ్లీ నగరానికి తీసుకొస్తున్న సమయంలో, మీంజూరు-వండలూరు బైపాస్‌ రోడ్డు(Meenjur-Vandalur Bypass Road)లోని చోళవరం టోల్‌ ప్లాజా సమీపంలో హఠాత్తుగా మరమ్మతులకు గురైంది.

ఈ వార్తను కూడా చదవండి: Enforcement Directorate: సినీ దర్శకుడు అమీర్‌ ఖాతాలో డబ్బు జమ చేసిన సాధిక్‌


దీంతో డ్రైవర్‌, రోడ్డు పక్కనే దానిని నిలిపి వెళ్లిపోయాడు. కొద్ది నెలలుగా ఆ ప్రాంతంలో ఉన్న రోడ్‌ రోలర్‌కు మరమ్మతులు చేపట్టేందుకు దినకరన్‌ ఈ నెల 24న మెకానిక్‌తో ఆ ప్రాంతానికి వెళ్లగా వాహనం లేకపోవడం గమనించి దిగ్ర్భాంతి చెందాడు. ఈ వ్యవహారంపై దినకరన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోళవరం పోలీసులు విచారణ చేపట్టారు. టోల్‌ ప్లాజా, రెడ్‌ హిల్స్‌ రోడ్డు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ ఆధారంగా లారీలో రోడ్‌ రోలర్‌ తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.


లారీ రిజిస్ట్రేషన్‌ నెంబరు ఆధారంగా తిరువళ్లూర్‌ సమీపం పుల్లారంబాక్కం ప్రాంతానికి చెందిన అలెక్స్‌, గోపినాధ్‌, వెంకటేశన్‌ లను అరెస్ట్‌ చేశారు. పలు నెలలుగా రోడ్డు పక్కనే రోడ్‌ రోలర్‌ ఉండడాన్ని గమనించినఆ ముగ్గురు క్రేన్‌ సాయంతో రోడ్‌ రోలర్‌ను లారీలో ఎక్కించి తీసుకెళ్లినట్లు విచారణలో తెలియగా, వారిచ్చిన సమాచారంతో లారీ, రోడ్‌ రోలర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్‌ లేకుండా చూడాలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2025 | 12:29 PM