Enforcement Directorate: సినీ దర్శకుడు అమీర్ ఖాతాలో డబ్బు జమ చేసిన సాధిక్
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:08 PM
సినీ దర్శకుడు అమీర్(Film director Aamir) బ్యాంకు ఖాతాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నిందితుడైన జాఫర్ సాధిక్ డబ్బులు జమ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు నిర్థారించారు. ఈ మేరకు వారు తగిన ఆధారాలను సేకరించారు.
- నిర్థారించిన ఈడీ
చెన్నై: సినీ దర్శకుడు అమీర్(Film director Aamir) బ్యాంకు ఖాతాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసు నిందితుడైన జాఫర్ సాధిక్ డబ్బులు జమ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు నిర్థారించారు. ఈ మేరకు వారు తగిన ఆధారాలను సేకరించారు. పైగా జాఫర్ సాధిక్ అధికార డీఎంకే నేత కావడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో కలిసి జాఫర్ సాధిక్(Jafar Sadiq) కొన్నేళ్ళుగా వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Heavy rains: దక్షిణాది జిల్లాలకు భారీ వర్ష సూచన..

అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అయిన జాఫర్ సాధిక్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈడీ అధికారులు మాత్రం బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News