Heavy rains: దక్షిణాది జిల్లాలకు భారీ వర్ష సూచన..
ABN , Publish Date - Feb 28 , 2025 | 11:48 AM
దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురువనున్నట్లు భారత వాతావరణ చెన్నై ప్రాంతీయ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని 12 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

- 12 జిల్లాల కలెక్టర్లతో సీఎం స్టాలిన్ సమీక్ష
చెన్నై: దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురువనున్నట్లు భారత వాతావరణ చెన్నై ప్రాంతీయ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని 12 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్, ఆర్.చక్రపాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Tax Revenue: కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత?
బంగాళాఖాతంలో తూర్పు దిశ గాలుల్లో మార్పు కారణంగా శుక్రవారం నుంచి మార్చి 3వ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని స్టాలిన్ ఆదేశించారు. ఇక వాతావరణ శాఖ చేసిన ప్రకటన ప్రకారం పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
అదే విధంగా శుక్రవారం నుంచి మార్చి ఒకటి వరకు తంజావూరు, పుదుక్కోట, రామనాథపురం(Thanjavur, Pudukkottai, Ramanathapuram), శివగంగై, విరుదునగర్, తేని, మదురై, దిండిగల్, తెన్‌కాశి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో కోయంబత్తూరు, నీలగిరి, తిరుపూర్, తేని, దిండిగల్(Nilgiris, Tirupur, Theni, Dindigul), తెన్‌కాశి, తిరునెల్వేలి, కన్నియాకుమారితో సహా 22జిల్లాల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందస్తుచర్యలతో పాటు ప్రజలకు అవసరమైన సహాయ సామగ్రిని సిద్ధం చేసివుంచుకోవాలని ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News