Hyderabad: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకుల ఆత్మహత్య
ABN, Publish Date - Feb 06 , 2025 | 07:41 AM
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software employee) కాగా మరొకరు సీఏ చదువుతున్నాడు. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఇందుకు సంభందించిన వివరాలను తెలిపారు.
- ఒకరు సాఫ్ట్‌వేర్.. మరొకరు సీఏ విద్యార్థి
హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(Software employee) కాగా మరొకరు సీఏ చదువుతున్నాడు. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బూగారం మండలం బోపాల్‌పూర్(Bhopalpur) గ్రామానికి చెందిన గంతల కుమార్(28) గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ బీకేగూడ సంజయ్‌గాంధీనగర్ కాలనీలో తన స్నేహితుడు గంగాధర్‌తో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం గంగాధర్ బయటకు వెళ్లి తిరిగివచ్చేసరికి కుమార్ ఉరేసుకుని కనిపించాడు. గంగాధర్ ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు సుసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ‘ఈ జీవితం నాకు నచ్చలేదు నన్ను క్షమించండి’ అని అందులో ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: మహా కుంభమేళాకు మరో 4 ప్రత్యేకరైళ్లు..
బాపూనగర్ హాస్టల్‌లో సీఏ విద్యార్థి..
మంగళవారం రాత్రి సీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నాటక రాయ్‌చూర్(Karnataka Raichur) జిల్లాకు చెందిన రాజుశెగ్గి కుమారుడు అమర్‌జిత్ (18) ఎస్‌ఆర్‌నగర్ బాపూనగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. డిసెంబర్ 22న పరీక్షలు రాసి సొంత గ్రామానికి వెళ్లాడు. పరీక్ష లు సరిగా రాయలేదని బాధపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 27న మరో పరిక్ష రాయాల్సి ఉండగా తిరిగి నగరానికి వచ్చి హాస్టల్ ఉన్నాడు.
మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా తన ఆరోగ్యం బాగాలేదని గదిలోనే ఉన్నాడు. రాత్రి 10.30 గంటల సమయంలో రూమ్‌మేట్ ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో హాస్టల్ నిర్వాహాకులకు చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అమర్‌జిత్ ఉరి వేసుకుని కనిపించాడు. ఆత్మహత్యకు గల కారాణాలపై పోలీసులు విచారణ జరిపి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News
Updated Date - Feb 06 , 2025 | 07:41 AM