ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సినిమాలో వేషం ఇప్పిస్తానని లైంగిక దాడి

ABN, Publish Date - Jan 18 , 2025 | 10:18 AM

సినిమాలో నటించే అవకాశం కల్పిస్తానని సినిమా పరిశ్రమ డైరెక్షన్‌ విభాగంలో పనిచేసే ఒక వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు చెందిన వివాహితకు భర్తతో విభేదాలు రావడంతో అతడి నుంచి విడిపోయి మణికొండ(Manikonda)లో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తోంది.

- కేసు నమోదు

హైదరాబాద్: సినిమాలో నటించే అవకాశం కల్పిస్తానని సినిమా పరిశ్రమ డైరెక్షన్‌ విభాగంలో పనిచేసే ఒక వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు చెందిన వివాహితకు భర్తతో విభేదాలు రావడంతో అతడి నుంచి విడిపోయి మణికొండ(Manikonda)లో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తోంది. సినిమాలో నటిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చని భావించింది.

ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: గ్యాస్‌ రిపేర్‌ ముసుగున డ్రగ్స్‌ దందా..


ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం అమీర్‌ పేటలోని ఓ హాస్టల్‌ చేరి సినిమాల్లో జూనియర్‌ ఆర్టి్‌స్టు(Junior Artist)గా అవకాశం కోసం మూడు రోజులుగా కృష్ణానగర్‌, ఇందిరానగర్‌(Krishnanagar, Indiranagar) పరిసరాల్లో తిరుగుతోంది. ఈ క్రమంలో ఆమెకు సినీ పరిశ్రమలో డైరెక్షన్‌ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది.


మూడు రోజుల క్రితం ఆడిషన్స్‌ ఉన్నాయంటూ కృష్ణానగర్‌(Krishnanagar)లోని హెవెన్‌ హోటల్‌కు ఆమెను పిలిచాడు. మొదటి రోజు ఫొటోషూట్‌ చేసి మరుసటి రోజు రావాలని చెప్పాడు. రెండో రోజు గదికి వెళ్లగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్‌ఎస్‌ 64,79,115,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 10:18 AM