Hyderabad: రూ. 70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టేశాడు..
ABN, Publish Date - Feb 27 , 2025 | 07:12 AM
అధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడో తాపీమేస్త్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం(Anantapur) జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా దాసారం గుడిసెల సమీపంలోని అపార్ట్‌మెంట్(Apartment)లో నివసిస్తున్నాడు.
- అధిక వడ్డీ, చిట్టీల పేరుతో వసూలు
- రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులతో ఉడాయించిన తాపీమేస్త్రీ
హైదరాబాద్: అధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడో తాపీమేస్త్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం(Anantapur) జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా దాసారం గుడిసెల సమీపంలోని అపార్ట్‌మెంట్(Apartment)లో నివసిస్తున్నాడు. ఎస్‌ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. బీకేగూడ,ఎస్‌ఆర్ నగర్‌లో 15 ఏళ్లుగా చిట్టీ, ఫైనాన్స్(Chitty, Finance) వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీ పేరు చెప్పి సుమారు 300 మంది నుంచి రూ. 70కోట్లు వసూలు చేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను.. కాంగ్రెస్ ఫ్లెక్సీలలో నా ఫొటో వాడుతున్నారు
డబ్బు కోసం ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నెల 24, 25, 26 తేదీల్లో చెల్లిస్తానని పుల్లయ్య నమ్మించాడు. 23వ తేదీ రాత్రి కారును ఇంట్లోనే వదిలేసి క్యాబ్‌లో కుటుంబ సభ్యులతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు బీకే గూడలో అతడి నివాసానికి చేరుకున్నారు. పుల్లయ్య బాధితులు నగరం, గుత్తి, కర్నూల్(Guthi, Kurnool) జిల్లాలో కూడా ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమయ్యారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News
Updated Date - Feb 27 , 2025 | 07:12 AM