Hyderabad: వారిద్దరిని పట్టించిన వారికి రూ.5 లక్షలు..
ABN, Publish Date - Feb 21 , 2025 | 08:02 AM
ఇటీవల అఫ్జల్‌గంజ్(Afzalganj)లో ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులకు తెగబడిన బిహార్ దోపిడీ దొంగలను పట్టించిన వారికి హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) రూ. 5లక్షలు రివార్డు అందజేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
- కాల్పుల కేసుల్లో బిహార్ గ్యాంగ్‌ను పట్టించిన వారికి పోలీసుల రివార్డు
హైదరాబాద్ సిటీ: ఇటీవల అఫ్జల్‌గంజ్(Afzalganj)లో ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులకు తెగబడిన బిహార్ దోపిడీ దొంగలను పట్టించిన వారికి హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) రూ. 5లక్షలు రివార్డు అందజేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. జనవరి 16న బీదర్‌లో రూ. 93 లక్షలు ఏటీఎం డబ్బుల దోపిడీకి పాల్పడి.. అక్కడి సెక్యూరిటీ గార్డును కాల్చి చంపి ఆ తర్వాత హైదరాబాద్‌కు పారిపోయి వచ్చిన దుండుగులు అఫ్జల్‌గంజ్‌లో ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ వార్తను కూడా చదవండి: Principal Secretary: పదేళ్లు పొరంబోకు స్థలంలో నివసిస్తే పట్టా..
ఒక్కరోజు రెండు రాష్ట్రాల్లో కాల్పులకు తెగబడి అరాచకం సృష్టించిన బిహార్ దొంగలు అమిత్, మనీష్ గ్యాంగ్ కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, బిహార్, యూపీ(Telangana, Karnataka, Chhattisgarh, Bihar, UP) రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడినట్లు గుర్తించిన ఈ ముఠాపై గతంలోనే యూపీ పోలీసులు రూ. 4లక్షల రివార్డు ప్రకటించారు.
కాగా.. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు సైతం బిహార్ దొంగల ముఠా ఆచూకీ తెలిపిన వారికి రూ. 5 లక్షలు రివార్డు అందజేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది. కాల్పుల అనంతరం నగరంలోనే నక్కిన వీరు అదే రోజు అర్ధరాత్రి నగరం విడిచివెళ్లి పోయారు. పోలీసులు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి గాలింపు చేపట్టినా నిందితుల జాడ దొరకలేదు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తుండటంతో ఈ ముఠా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News
Updated Date - Feb 21 , 2025 | 08:03 AM