ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫోర్జరీ కేసులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అరెస్ట్‌

ABN, Publish Date - Feb 06 , 2025 | 01:28 PM

దొంగ సంతకాలు, ఫోర్జరీ, చీటింగ్‌ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో ఏ1గా ఉన్న టీఎన్‌జీవోస్ కాలనీ నివాసి కొప్పుల అమరేశ్వర్‌ గౌడ్‌(51)ను మైలార్‌దేవుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్: దొంగ సంతకాలు, ఫోర్జరీ, చీటింగ్‌ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో ఏ1గా ఉన్న టీఎన్‌జీవోస్ కాలనీ నివాసి కొప్పుల అమరేశ్వర్‌ గౌడ్‌(51)ను మైలార్‌దేవుపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో జనవరి 28న మరో నిందితుడు శ్రీనివా్‌సను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన కుక్కమల్ల ప్రకాశంకు 1974లో కాటేదాన్‌లోని టీఎన్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో ప్లాట్‌ నంబర్‌ 517లో 300 గజాల స్థలం అలాట్‌ అయ్యింది. 1999లో ప్రకాశం మరణించాడు.

ఈ వార్తను కూడా చదవండి: భార్యను సంసారానికి పంపలేదని చిన్నత్తను కత్తితో పొడిచిన యువకుడు


ఆ ప్లాట్‌ ఖాళీగా ఉండటంతో కన్నేసిన కాటేదాన్‌ టీఎన్‌జీవోస్‌ కాలనీకి చెందిన కొప్పుల అమరేశ్వర్‌గౌడ్‌(51) 2011లో తనకు తెలిసిన సుభాష్‌, శ్రీనివాస్‌, సయ్యద్‌ రశీద్‌ఖాన్‌, నర్సింహ్మరెడ్డితో కుమ్మక్తై గుర్తు తెలియని వ్యక్తి ఫొటోను పెట్టి అతనే కుక్కమల్ల ప్రకాశం అని నమ్మించారు. అమరేశ్వర్‌గౌడ్‌ ఫోర్జరీ సంతకం చేసి సుభాష్‌ అనే వ్యక్తి పేరు మీద జీపీఏ చేశాడు. తర్వాత అట్టి ప్లాట్‌ను వీరందరూ కలిసి అశోక్‌ అగర్వాల్‌కు విక్రయించారు. అశోక్‌ అగర్వాల్‌, సంజుదేవి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు.


ప్రకాశం కుటుంబ సభ్యులు అట్టి స్థలాన్ని మైలార్‌దేవుపల్లికి చెందిన పవన్‌ గౌడ్‌ అనే వ్యక్తికి ఇటీవల జీపీఏ రిజిస్ట్రేషన్‌ చేశారు. పవన్‌గౌడ్‌ స్థలం వద్దకు రాగా అప్పటికే ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుని అశోక్‌ అగర్వాల్‌, సంజుదేవీ నివాసం ఉంటున్నట్లు తెలిసుకున్నాడు. దీంతో పవన్‌గౌడ్‌ మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ ప్రకాశంకు చెందిన స్థలాన్ని కొప్పుల అమరేశ్వర్‌గౌడ్‌ మరి కొంతమందితో కలసి కబ్జా చేసి ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తెలుసుకున్నారు. ఈ కేసులో 2025 జనవరి 28న ఏ2 గా ఉన్న శ్రీనివాసును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా బుధవారం ఏ1 గా ఉన్న అమరేశ్వర్‌ గౌడ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అమరేశ్వర్‌గౌడ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన

ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్‌ డంపుయార్డ్‌ పనులు ప్రారంభం

ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2025 | 01:28 PM