WhatsApp Admin Shot Dead: దారుణం.. గ్రూప్‌ను తొలగించాడని వాట్సాప్ అడ్మిన్‌పై కోపంతో..
ABN, Publish Date - Mar 09 , 2025 | 05:44 PM
పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనను గ్రూప్ నుంచి తొలగించినందుకు ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ను తుపాకీతో కాల్చి హత్య చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ గ్రూపులు.. ప్రస్తుతం సమచారం ఇచ్చి పుచ్చుకునేందుకు ఇవే ప్రధానమైన సాధనాలు. కాలనీ వాసులు, అపార్ట్‌మెంట్ వాసులు, ఒకే రోడ్డులో ఉండేవారు, ఇలా జనాలు రకరకాల సమూహాలుగా గ్రూపులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే, గ్రూపుల్లో చిన్న చిన్న విషయాలు తగాదాలకు దారి తీయడం కామన్. అయితే, పాకిస్థాన్‌లో ఈ వివాదం ఏకంగా హత్యకు (Crime) దారి తీసింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్‌మెంట్
ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో పెషావర్ నగర శివారుల్లోని రెజీ అనే ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అష్వాఖ్ ఖాన్ అనే వ్యక్తి వాట్సా్ప్ గ్రూపు నిర్వహిస్తున్న అడ్మిన్ ముస్తాఖ్ అహ్మద్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. తనను గ్రూపు నుంచి తొలగించాడన్న అక్కసుతో ఈ పని చేశాడు. గ్రూపు నుంచి తొలగింపును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తొలుత ఇద్దరూ ఓ చోట కలిశారు. అష్ఫాక్ తన వెంట తుపాకీ కూడా తెచ్చుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగానే అష్ఫాక్ తన తుపాకీతో ఒక్కసారిగా ముస్తాక్‌పై కాల్పులకు తెగబడటంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అయితే, వారి మధ్య వివాదం నెలకున్నట్టు తమకు అసలు తెలియదని మృతుడి సోదరుడు పేర్కొ్న్నారు. ఈ దారుణం వెలుగులోకి వచ్చే వరకూ తమకు వారి మధ్య రగడ జరుగుతోందని తెలీదన్నారు. చాలా చిన్న విషయం ఇంత దారుణానికి దారి తీస్తుందని తాము అస్సలు ఊహించలేదని అన్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాతో పాటు స్థానికంగా కూడా కలకలం రేగింది. రమ్‌జాన్ పవిత్ర మాసంలో ఇలా జరగడంపై అనేక మంది విచారం వ్యక్తం చేశారు. ఆయుధాలు సులువుగా లభించడం, స్థానిక తెగల విశ్వాసాలు, చట్టబద్ధ పాలన లేకపోవడం వంటివి ఈ దారుణాలకు కారణమవుతున్నాయని అన్నారు. మరోవైపు, హంతకుడి కోసం స్థానిక పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Updated Date - Mar 09 , 2025 | 05:47 PM