Kolkata Shocking Case: నది ఒడ్డుకు సూట్‌కేస్‌తో మహిళలు.. తెరిచి చూస్తే.. కోల్‌కతాలో షాకింగ్ ఘటన..
ABN, Publish Date - Feb 25 , 2025 | 08:40 PM
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అహిరిటోలా ఘాట్ దగ్గరకు ఇద్దరు మహిళలు పెద్ద సూట్‌కేసు పట్టుకుని వచ్చారు. స్థానికులకు ఆ సూట్‌కేస్ చూడగానే అనుమానం వచ్చింది. లోపల తమ పెంపుడు కుక్క అస్తికలు ఉన్నాయని ఆ మహిళలు ఇద్దరూ బుకాయించారు.
ఆ మహిళలు ఇద్దరూ సూట్‌కేస్ పట్టుకుని టాక్సీ ఎక్కారు.. హుబ్లీ నది దగ్గర దిగారు.. వారి చేతిలో పెద్ద సూట్‌కేస్‌ను చూసి చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది.. వాళ్లు నది దగ్గరకు వెళ్లడం చూసి స్థానికులు వారిని అడ్డుకున్నారు.. లోపల ఏం ఉన్నాయని ప్రశ్నించారు.. తమ పెంపుడు కుక్క అస్థికలు ఉన్నాయని ఆ ఇద్దరు మహిళలు బదులిచ్చారు.. అనుమానం వచ్చి ఆ సూట్‌కేస్ తెరిచి చూసి అందరూ నివ్వెరపోయారు.. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది (Crime News).
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో (Kolkata) సంచలన ఘటన చోటుచేసుకుంది. అహిరిటోలా ఘాట్ దగ్గరకు ఇద్దరు మహిళలు పెద్ద సూట్‌కేసు పట్టుకుని వచ్చారు. స్థానికులకు ఆ సూట్‌కేస్ చూడగానే అనుమానం వచ్చింది. లోపల తమ పెంపుడు కుక్క అస్తికలు ఉన్నాయని ఆ మహిళలు ఇద్దరూ బుకాయించారు. వారి మాటలు నమ్మని స్థానికులు సూట్‌కేస్‌ను తెరిచి చూశారు. లోపల మనిషి శరీర భాగాలు (Human Body Parts) ఉన్నాయి. హుగ్లీ నదిలో వాటిని పడెయ్యాలని ప్రయత్నించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అలాగే సూట్‌కేస్‌లోని శరీర అవయవాలను పోస్ట్‌మార్టంకు పంపించారు. ఆ శరీర భాగాల విషయమై ఆ మహిళలు ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు. ఎవరినైనా హత్య చేసి, ముక్కలుగా కోసి నదిలో పారెయ్యడానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Cyber criminals: ఉద్యోగాల పేరుతో బురిడీ.. రూ.2లక్షలకు టోపీ
మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 25 , 2025 | 08:40 PM