Shocking: డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసులో షాకింగ్ ట్విస్ట్.. అసలు నిందితులు ఎవరో తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:11 PM
కొన్ని రోజుల క్రితం వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. కారులో వెళ్తున్న సుమంత్‌ను కొందరు దుండగులు అడ్డుకుని ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన సుమంత్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు.

కొన్ని రోజుల క్రితం వరంగల్ లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. కారులో వెళ్తున్న సుమంత్‌ను కొందరు దుండగులు అడ్డుకుని ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన సుమంత్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ కేసులు పోలీసులు తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు. సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం వెనుక అతడి భార్య ఫ్లోరా, అమె ప్రియుడు ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు (Crime News)
డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా అనే మహిళతో ప్రేమలో పడి కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. సుమంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో అతడి భార్య ఫ్లోరా ఓ జిమ్‌లో జాయిన్ అయింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని వరంగల్‌కు షిఫ్ట్ అయిపోయారు. సుమంత్ కాజీపేటలో క్లినిక్ పెట్టుకున్నారు. ఫ్లోరా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పని చేయడం మొదలుపెట్టింది.
మరోవైపు ప్రియుడు సామెల్‌తో ఆమె మాట్లాడుతూనే ఉంది. భర్త సుమంత్‌ను చంపేస్తే ఇద్దరూ కలిసి ఉండవచ్చని ఫ్లోరా, సామెల్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఫ్లోరా కొంత డబ్బు సామెల్‌కు ఇచ్చి సుమంత్ చంపెయ్యాలని చెప్పింది. ఈ మర్డర్‌కు గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు సహాయం చేశాడు. వరంగల్ భట్టుపల్లిలో ఈనెల 19న సుమంత్ కారు అడ్డగించి అతడిపై ఐరన్ రాడ్లతో దాడి నిందితులు దాడి చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేసిన పోలీసులు అసలు నిజాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
మరిన్ని క్రైమ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..