Hyderabad: కిడ్నాప్‌నకు గురైన బాలుడు 48 గంటల్లో తల్లి ఒడికి..
ABN, Publish Date - Feb 20 , 2025 | 09:26 AM
48 గంటల్లోనే బాలుడి కిడ్నాప్ కేసును అఫ్జల్‌గంజ్ పోలీసులు(Afzalganj Police) ఛేదించారు. బాలుడిని బెగ్గింగ్‌ముఠాకు అప్పగించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
- ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు నగదు పురస్కారం
హైదరాబాద్: 48 గంటల్లోనే బాలుడి కిడ్నాప్ కేసును అఫ్జల్‌గంజ్ పోలీసులు(Afzalganj Police) ఛేదించారు. బాలుడిని బెగ్గింగ్‌ముఠాకు అప్పగించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. తూర్పు మండలం డీసీపీ బాలస్వామి చేతుల మీదుగా బాలుడిని ఆమె తల్లికి అప్పగించారు. బుధవారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్(Afzalganj Police Station)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శంకర్, సీఐ రవినాయక్‌తో కలిసి వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హైడ్రాను మరింత పటిష్టం చేయాలి..
కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి చెందిన బి.దేవి(25) కుమారుడు ప్రేమ్‌కుమార్(2)తో కలిసి ఆరు రోజుల క్రితం నగరంలోని తనకు తెలిసిన బందువు చెల్లెలు కుమారి ఇంటికి బయలుదేరింది. గౌలిగూడలోని మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌కు వచ్చింది. కుమారి ఫోన్‌నంబర్ పోగొట్టుకోవడంతో చేసేది లేక రెండు రోజులపాటు సీబీఎస్ ఫుట్‌పాత్ వద్దనే కుమారుడితో భిక్షాటన చేస్తూ నిద్రించింది.
ఈనెల 15న రాత్రి నిద్రించిన కొద్దిసేపటి తర్వాత బాలుడు ఏడుస్తుండడం గమనించిన షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన షేక్ అమీర్(25), టోలిచౌకీకి చెందిన మహ్మద్ అబ్దుల్ సల్మాన్(30) కిడ్నాప్ చేసి ప్యాసింజర్ ఆటో(టీఎస్ 10 యూసీ 7279)లో పారిపోయారు. 16న మెళకువ వచ్చిన దేవి కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళన చెంది సీబీఎస్ పరిసర ప్రాంతాల్లో వెతికింది. ఆచూకీ దొరకకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీసులను ఆశ్రయించింది.
అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ రవినాయక్, డీఐ మధుకుమార్, ఎస్‌ఐ జగదీశ్‌లు వెంటనే మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీబీఎస్ పరిసరాలలో సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకొని ప్యాసింజర్ ఆటోలో పారిపోయినట్లు స్పష్టంగా గుర్తించారు. నిందితులు పారిపోయిన ఆటో నంబర్ ఆధారంగా టోలీచౌకిలోని మహ్మద్ అబ్దుల్ సల్మాన్ ఇంటిపైన దాడి చేయడంతో రెప్పపాటులో పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.
అక్కడే షేక్ అమీర్‌ను పట్టుకుని విచారరించడంతో బాలుడిని సాజిదాబేగం, మహ్మది బేగంలకు అప్పగించినట్లు చెప్పడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బాలుడికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. పోలీస్ స్టేషనలో తల్లి దేవికి అప్పగించారు. ఈ కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ రవినాయక్‌తోపాటు ఎస్‌ఐ జగదీశ్, కానిస్టేబుళ్లు విశాల్, జితేందర్, శ్రీకాంత్‌లకు నగదు రివార్డులను అందజేసి వారిని అభినందించారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News
Updated Date - Feb 20 , 2025 | 09:26 AM