ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గర్భిణిపై భర్త అమానుషం.. కడుపుపై కూర్చుని.. ముఖంపై దిండు అదిమిపెట్టి హత్య

ABN, Publish Date - Jan 22 , 2025 | 08:08 AM

వారిరువురూ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుని విభేదాలతో దూరమయ్యారు. ఆ తర్వాత రాజీ కుదుర్చుకుని ఒక్కటయ్యారు. కొద్ది రోజులకు భార్య ఏడునెలల గర్భవతి అని తేలడంతో అతనిలోని అనుమానపు మృగం రెచ్చిపోయింది.

- ప్రేమించి పెళ్లాడిన భార్యపై అనుమానంతో ఘాతుకం

- కుషాయిగూడలో వెలుగు చూసిన దారుణం

- నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్: వారిరువురూ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుని విభేదాలతో దూరమయ్యారు. ఆ తర్వాత రాజీ కుదుర్చుకుని ఒక్కటయ్యారు. కొద్ది రోజులకు భార్య ఏడునెలల గర్భవతి అని తేలడంతో అతనిలోని అనుమానపు మృగం రెచ్చిపోయింది. కిరాతకుడిగా మారి ఆమె పొట్టపై కూర్చుని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీంతో గర్భస్థ శిశువు సైతం బయటపడింది. అత్యంత హృదయవిదారకర సంఘటన ఈనెల 18న కుషాయిగూడ(Kushaiguda)లోని నాగార్జున నగర్‌లో జరిగింది. ఎస్సై జి.అంజయ్య తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అమ్మకానికి అరుదైన అలెగ్జాండ్రిన్‌ రామచిలుకలు


కాచిగూడ రాజ్‌మోహల్లాకు చెందిన సచిన్‌ సత్యనారాయణ(21)కు కాప్రాకు చెందిన ఠాకూర్‌ స్నేహ(21)తో 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 2022లో వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కొన్ని నెలల పాటు ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌(Food delivery boy)గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల క్రితం భార్యతో రాజీ కుదుర్చుకుని నాగార్జుననగర్‌(Nagarjunanagar) కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. కొద్ది రోజుల అనంతరం భార్య ఏడు నెలల గర్భవతి అని తేలడంతో సత్యనారాయణకు ఆమెపై అనుమానం ఏర్పడింది. ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్య ఏడు నెలల గర్భిణీ ఎలా అయిందని అనుమానంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి.


ఈ నెల 16న తెల్లవారు జామున స్నేహతో గొడవపడ్డ సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీంతో కడుపులో ఉన్న ఏడునెలల పిండం కూడా బయటపడింది. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు. 18న ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య తెలిపారు. నిందితుడిపై హత్య చేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 08:14 AM