Hyderabad: హేళన చేస్తున్నాడని కడతేర్చారు..
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:04 PM
వ్యక్తి హత్యకేసును చర్లపల్లి పోలీసులు(Cherlapalli Police) ఛేదించారు. తొమ్మిదిమంది నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ రవికుమార్(Inspector Ravikumar) వివరాలు వెల్లడించారు.
- వ్యక్తి హత్య కేసులో తొమ్మిదిమంది అరెస్ట్
హైదరాబాద్: వ్యక్తి హత్యకేసును చర్లపల్లి పోలీసులు(Cherlapalli Police) ఛేదించారు. తొమ్మిదిమంది నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ రవికుమార్(Inspector Ravikumar) వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రం, దుమ్కా జిల్లా, ముకురాంపూర్ కమర్సాలి గ్రామానికి చెందిన బాబుషాయ్ తుడు(34) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చర్లపల్లి(Cherlapalli) పారిశ్రామికవాడ ఫేజ్-1లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Collector: అర్హులందరికీ రేషన్ కార్డులు
అతడి స్వగ్రామం, పరిసర గ్రామాలకు చెందిన మరికొంతమంది కూడా సదరు కంపెనీలో పనిచేస్తూ యాజమాన్యం కేటాయించిన గదుల్లో ఉంటున్నారు. వీరంతా సెలవు రోజుల్లో మద్యం తాగేవారు. బాబూషాయ్(Babushai) తరచుగా తోటి కార్మికులను అవహేళన చేస్తూ, వారిపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు. అతడి ప్రవర్తన నచ్చని తోటి కార్మికులు అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగరోజు రాత్రి అందరూ కలిసి స్థానికంగా గల దుర్గాభవానీ వైన్స్‌లో మద్యం తాగారు.
అనంతరం బాబుషాయ్‌ను చర్లపల్లి పుక్కట్‌నగర్ రోడ్డులోగల ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి మళ్లీ మద్యం తాగించి చితకబాదారు. కిందపడిపోయిన అతడి తలపై లుఖీరామ్, అభిలాష్ భక్షి బండరాయితో కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న బాబుషాయ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. పుక్కట్‌నగర్‌లో వ్యక్తి చనిపోయి ఉన్నాడని పండగ మరుసటి రోజు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. లుఖీరామ్‌తుడు (27), రాసిలాల్ సోరెన్ (28), అభిలాష్ భక్షి(33), ఉత్తమ్ హన్స్‌డా (22), కోసలేందర్ సోరెన్ (26), సికిందర్ మరాండీ(24), సికిందర్ ముర్ము (18), సందీప్ ముర్ము(26), గులాబ్ ముర్ము (27)లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందుతులను రిమాండ్‌కు తరలించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?
ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు
ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ
ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 19 , 2025 | 12:04 PM