ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గంజాయి సేవిస్తూ పట్టుబడిన ముఠా..

ABN, Publish Date - Feb 21 , 2025 | 01:30 PM

మాదాపూర్‌(Madhapur)లో మిట్టమధ్యాహ్నం గంజాయి సేవిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఒక మహిళ సహా.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్‌ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్‌ వచ్చింది.

- డ్రగ్స్‌ పరీక్షల్లో పాజిటీవ్‌గా నిర్ధారణ

- ఒక మహిళ, నలుగురు నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: మాదాపూర్‌(Madhapur)లో మిట్టమధ్యాహ్నం గంజాయి సేవిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఒక మహిళ సహా.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్‌ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్‌ వచ్చింది. దాంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానామెట్‌(Khanamet)లోని జీఆర్‌సీ (జి.రామచంద్రారెడ్డి) రెసిడెన్సీలో నివా సం ఉంటున్న అక్కిరెడ్డి వెంకటేశ్‌ తన స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు మధ్యాహ్నం సమాచారం అందింది.

ఈ వార్తను కూడా చదవండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..


దాంతో ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి నిందితులు అక్కిరెడ్డి వెంకటేష్‌, పి. విజయరెడ్డి, ఎం.రాహుల్‌, ఎస్‌.శివకుమార్‌, ప్రియాంకరెడ్డిలను అదుపదులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్స్‌ కిట్స్‌తో యూరిన్‌ పరీక్షలు నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు తేలింది. దాంతో వారిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితులందరూ నిజామాబాద్‌(Nizamabad)కు చెందిన వ్యక్తులు కాగా.. వారితో పట్టుబడ్డ మహిళ ప్రియాంకరెడ్డిది హైదరాబాద్‌గా గుర్తించామన్నా రు.


వారికి గంజాయి విక్రయించిన నిందితులు ఎవరు..? ఎక్కడి నుంచి గంజాయి తెస్తున్నారు..? ఎంతకాలంగా ఈ ముఠాకు విక్రయిస్తున్నారు..? వీరితో పాటు ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రియాంకరెడ్డి గతంలోనూ గచ్చిబౌలి పరిధిలో డ్రగ్స్‌ తీసుకుంటూ ఎస్‌వోటి పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అర్కెటెక్చర్‌గా చేస్తున్న ఆమె అప్పట్లో కొరియోగ్రాఫర్‌, వారి స్నేహితులతో కలిసి ఎండీఎంఏ డ్రగ్స్‌ తీసుకుంటుండగా.. సైబరాబాద్‌ ఎస్‌వోటి, గచ్చిబౌలి పోలీసులు గతేడాది డిసెంబర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా.. ఇప్పుడు గంజాయి తీసుకుంటూ మాదాపూర్‌ చిక్కి అరెస్టయినట్లు ఆమె అని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్‌ గురుదక్షిణ

ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2025 | 01:30 PM