Software jobs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం..
ABN, Publish Date - Jan 29 , 2025 | 09:16 AM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామని(Software jobs) నిరుద్యోగులను మోసం చేసి రూ.26.25 లక్షలు కొల్లగొట్టిన ముఠా ఆటకట్టించారు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(North Zone Task Force Police). నలుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
- రూ.26.25 లక్షలు కొల్లగొట్టిన ముఠా
- నలుగురి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిప్పిస్తామని(Software jobs) నిరుద్యోగులను మోసం చేసి రూ.26.25 లక్షలు కొల్లగొట్టిన ముఠా ఆటకట్టించారు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(North Zone Task Force Police). నలుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటకు చెందిన గడ్డపల్ల పవన్‌కుమార్, కింద్రాబాద్‌కు చెందిన బోగా రేవంత్, అంబర్‌పేటకు చెందిన సకినాల సుధీర్, ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన రాజీవ్‌రెడ్డి(Rajiv Reddy) ఒకరి ద్వారా మరొకరికి పరిచయం ఏర్పడింది.
ఈ వార్తను కూడా చదవండి: High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..
ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలని రేవంత్ పథకం వేఽశాడు. ఆ విషయాన్ని పవన్‌కు చెప్పాడు. సుధీర్‌కు గతంలో కన్సల్టెన్సీలో పనిచేసిన అనుభవం ఉండటంతో నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టించి డబ్బు సంపాదించాలని నిర్ణయించారు. ఇలా సుధీర్ నిరుద్యోగుల డేటాను సేకరించి పవన్‌కు ఇచ్చేవాడు. పవన్ హెచ్‌ఆర్ మేనేజర్‌లా మాట్లాడుతూ ఐటీ కంపెనీల్లో(IT companies) బ్యాక్‌డోర్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించేవాడు. ఆ తర్వాత వారికి ఫేక్ ఇంటర్వూలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపికైనట్లు నమ్మించేవాడు.
అలా ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల చొప్పున 13 మంది నుంచి రూ.26.25 లక్షలు వసూలు చేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను సంప్రదించడంతో నార్త్‌జోన్ పోలీసులు రంగంలోకి దిగారు. మారేడుపల్లి పోలీసులతో కలిసి నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.67 లక్షల నగదు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మారేడుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను
Read Latest Telangana News and National News
Updated Date - Jan 29 , 2025 | 09:16 AM