ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కత్తులు, బండరాళ్లతో దాడి.. స్నేహితుడి హత్య

ABN, Publish Date - Feb 26 , 2025 | 07:05 AM

స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ చినికిచినికి గాలివానలా మారి ఒకరి ప్రాణం తీసింది. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడిచేసుకోవడంతో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు.

- మరొకరికి గాయాలు

- మద్యం మత్తులో గొడవ

- ఉలిక్కిపడిన అల్లాపూర్‌, బోరబండ వాసులు

హైదరాబాద్: స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ చినికిచినికి గాలివానలా మారి ఒకరి ప్రాణం తీసింది. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడిచేసుకోవడంతో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. అల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌(Allapur Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే మంగళవారం) ఈ ఘటన జరిగింది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట డివిజన్‌ కబీర్‌నగర్‌ కాలనీకి చెందిన మాధవికి కొడుకు భానుప్రకాష్‌ (26), కుమార్తె ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: Etela Rajender: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే


అయితే, భానుప్రకాష్‌ ఎక్కువగా బంజారానగర్‌, శివాజీనగర్‌(Banjara Nagar, Shivaji Nagar) ప్రాంతాలలోనే ఉంటూ స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవాడు. సోమవారం సాయంత్రం తల్లి వద్ద రూ.500 తీసుకున్న భానుప్రకాష్‌.. స్నేహితులు ఫోన్‌ చేశారని, వెంటనే వస్తానని చెప్పి హోండాయాక్టివాపై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక గ్లాస్‌ ఫ్యాక్టరీ వద్ద ఓ యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


భానుప్రకాశ్‏తో సహా ఐదారుగురు యువకులు అర్ధరాత్రి వరకు మద్యం తాగి, ఆ మత్తులో వారి మధ్య వాగ్వాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మత్తులో ఉన్న వారంతా విచక్షణ కోల్పోయి కత్తులు, బండరాళ్లతో దాడిచేసి భానుప్రకా్‌షను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరో స్నేహితుడు శ్రీధర్‌ తలకు గాయాలయ్యాయని తెలిపారు. హోండా యాక్టివా ఆధారంగా మృతుడిని భానుప్రకా్‌షగా గుర్తించి మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు అతని తల్లి మాధవికి పోలీసులు ఫోన్‌ చేసి విషయం చెప్పారు.


వెంటనే ఆమె ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ భానుప్రకాష్‌ తల పగిలి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. భానుప్రకాష్‌ మృతదేహానికి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించామని, గాయాలపాలైన శ్రీధర్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భానుప్రకాష్‌ హత్యకు పాతకక్షలే కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఒక్కగానొక్క కొడుకు దూరమవడంతో..

ఏడేళ్ల క్రితం భర్తను కోల్పోయి.. ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు ఇలా స్నేహితుల చేతిలో హత్యకు గురవడంతో మాధవి గుండెలవిసేలా విలపిస్తోంది. స్నేహితుడు రమ్మన్నాడని రూ.500 తీసుకు వెళ్లిన కొడకు తెల్లారేసరికి విగత జీవుడయ్యాడని ఆ తల్లి చేసిన రోదనలు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టించాయి.


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 07:05 AM