ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

LIC Payment Options: ఇక వాట్సప్‌ బాట్‌ ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు

ABN, Publish Date - May 10 , 2025 | 05:51 AM

భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఇప్పుడు వాట్సప్‌ బాట్‌ ద్వారా ప్రీమియం చెల్లింపుల సదుపాయం అందిస్తోంది. యూజర్లు వాట్సప్‌ బాట్‌ను ఉపయోగించి యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, కార్డుల ద్వారా తమ చెల్లింపులు చేయగలరు.

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ‘‘వాట్సప్‌ బాట్‌’’ ద్వారా ప్రీమియం చెల్లింపునకు మరో ఆన్‌లైన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న యూజర్లు 8976862090 నంబర్‌కు వాట్సప్‌ చేయడం ద్వారా తమ పాలసీల్లో చెల్లింపు బకాయిలను గుర్తించి వాట్సప్‌ బాట్‌ ద్వారా యూపీఐ/నెట్‌బ్యాంకింగ్‌/కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. ఏయే పాలసీలకు ప్రీమియం చెల్లింపు బకాయి ఉందో గుర్తించడం, చెల్లించడం, రసీదు పొందడం అన్నీ వాట్సప్‌ బాట్‌ ద్వారా నే నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈ సదుపాయం వల్ల కస్టమర్లు ఎక్కడ నుంచైనా ప్రీమియం చెల్లింపులు చేయ వచ్చని ఎల్‌ఐసీ ఎండీ సిద్ధార్ధ మొహంతి తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 05:52 AM