ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Spam Calls: స్పామ్ కాల్స్ కట్టడి కోసం కీలక చర్యలు.. రోజుకు 13 మిలియన్ల కాల్స్ బ్లాక్

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:15 PM

వినియోగదారులకు వచ్చే స్పామ్ కాల్స్ కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ క్రమంలో ప్రతిరోజు 13 మిలియన్ల స్పామ్ కాల్స్ బ్లాక్ చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.

spam calls

దేశంలో యూజర్లకు వచ్చే స్పామ్ కాల్స్ (spam calls) సమస్యను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు టెలికాం రెగ్యులేటర్‌తో కలిసి టెలికమ్యూనికేషన్ల శాఖ మరింత చురుగ్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో కొత్త విధానాలను అమలు చేయడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతోపాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు, కాల్ కనెక్ట్ అయ్యే ముందు మూడు నెలల పాటు రింగ్‌టోన్‌ సందేశాలను అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ 13 మిలియన్ల స్పామ్ కాల్‌లను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.


స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయడం

స్పెయిన్‌ బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి సింధియా.. టెలికమ్యూనికేషన్ల శాఖ స్థాపించిన సంచార్ సాథి పోర్టల్‌ గురించి ప్రస్తావించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే అడ్డుకున్న నకిలీ కాల్స్, దొంగిలించబడిన మొబైల్ పరికరాల రికవరీకి సంబంధించిన గణాంకాలను పంచుకున్నారు. సైబర్ మోసానికి సంబంధించి 26 మిలియన్ల కాల్స్ సంచార్ సాథి పోర్టల్ విజయవంతంగా బ్లాక్ చేసిందని సింధియా తెలిపారు. దీంతోపాటు ఈ పోర్టల్ దొంగిలించబడిన 16 మిలియన్ల ఫోన్లను గుర్తించడంలో సహాయపడిందన్నారు కేంద్ర మంత్రి. ఇది 86 శాతం స్పూఫ్ లేదా నకిలీ కాల్‌లను గుర్తించి బ్లాక్ చేస్తుందని తెలిపారు.


సంచార్ సాథీ యాప్ ప్రారంభం

ఇటీవల దేశంలోని టెలికమ్యూనికేషన్ల విభాగం తన సంచార్ సాథీ పోర్టల్‌తోపాటు మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు నకిలీ కాల్స్ ను కట్టడి చేసుకోవచ్చు. దీంతోపాటు వారి పేరు మీద నమోదు ఉన్న నకిలీ సిమ్ కార్డులను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. మరోవైపు టెలికాం కంపెనీలు AI ఆధారిత స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని స్వీకరించాలని కూడా ఆదేశించారు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, Vi ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారుల కోసం AI ఆధారిత స్పామ్ కాల్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టాయి. ఇది ఆపరేటర్ స్థాయిలోనే మోసపూరిత కాల్‌లను నిరోధించడానికి వీలు కల్పిస్తుంది.


స్పామ్ కాల్స్‌పై అవగాహన పెంపు

ఈ క్రమంలో ప్రజల్లో స్పామ్ కాల్స్ గురించి అవగాహన కల్పించడానికి టెలికాం శాఖ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు ప్రజలకు నకిలీ కాల్స్‌ను ఎలా గుర్తించాలి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనేది తెలియజేస్తుంది. కాల్ కనెక్ట్ అయ్యే ముందు అవగాహన సందేశాలను వినియోగదారులకు అందించడం ద్వారా, ప్రజలు స్పామ్ కాల్స్ గురించి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండే అవకాశముంది.


ఇవి కూడా చదవండి:

Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 06 , 2025 | 06:50 PM