ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..

ABN, Publish Date - Mar 06 , 2025 | 02:53 PM

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ పన్ను చెల్లింపుల విషయంలో కీలక మార్పులను కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

tds

పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులకు ట్యాక్స్ చెల్లింపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే TDS, TCS పన్ను విధానాల్లో కీలక మార్పులను ప్రకటించింది. ఈ మార్పులతో పన్ను చెల్లింపుదారులు పలు రకాల పన్ను మినహాయింపులను పొందనున్నారు. ఈ క్రమంలో వ్యాపారులకు రూ. 50 లక్షలకుపైగా అమ్మకాలపై విధించే TCS రద్దు చేయబడింది. దీంతో ఏప్రిల్ 1, 2025 నుంచి వ్యాపారులు అధిక విలువ కలిగిన అమ్మకాలపై 0.1% TCS చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మార్పు నేపథ్యంలో వ్యాపారులు నగదు ప్రవాహాన్ని మరింత పెంచుకోనున్నారు.


మరింత సులభతరం

దీంతోపాటు టీసీఎస్ పరిమితిని రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు లేదా మరేదైనా ప్రయోజనం కోసం మీరు ఇప్పుడు TCS లేకుండా విదేశాలకు రూ. 10 లక్షల వరకు పంపించుకోవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత సులభతరం చేస్తుంది. దీంతోపాటు మీ డబ్బును విద్యా రుణం ద్వారా పంపిస్తే ఎలాంటి TCS ఉండదు. ఇది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.


అధిక పన్ను రేట్ల నుంచి..

అంతేకాదు ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇకపై TDS/TCS ఉండదు. గతంలో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయని వ్యక్తులు అధిక TDS/TCS తగ్గింపులను ఎదుర్కొవాల్సి వచ్చేది. సాధారణ పన్ను చెల్లింపుదారులు, చిన్న వ్యాపారాలకు అధిక పన్ను రేట్ల నుంచి ఉపశమనం కల్పించడానికి బడ్జెట్ 2025 ఈ నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు. వసూళ్ల పరంగా ముఖ్యంగా విదేశాలకు డబ్బు పంపడం, అధిక విలువ కలిగిన కొనుగోళ్లు చేయడం, వ్యాపార లావాదేవీలను నిర్వహించడం వంటి రంగాలలో అనేక మార్పులను ప్రకటించారు.


జైలుకు కూడా..

ఈ నేపథ్యంలో TCS డిపాజిట్ చేయడంలో ఆలస్యం జరిగితే జైలుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. గతంలో TCSను సకాలంలో డిపాజిట్ చేయకపోతే 3 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్షతోపాటు జరిమానా కూడా ఉండేది. ఈ నియమాన్ని 2025 బడ్జెట్‌లో సవరించారు. దీని ప్రకారం పెండింగ్‌లో ఉన్న TCSను నిర్ణీత సమయంలోపు డిపాజిట్ చేస్తే ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవు.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 06 , 2025 | 02:54 PM