Huawei Watch GT5 Pro: మార్కెట్‌లోకి కొత్త వాచ్.. ప్రత్యేకతలు చూస్తే మైండ్ బ్లాకే
ABN, Publish Date - Jan 02 , 2025 | 08:29 PM
Huawei Watch GT5 Pro: మార్కెట్‌లోకి కొత్త వాచ్‌లు వచ్చాయి. వాటిలోని ఫీచర్స్ మనస్సును కట్టిపడేస్తున్నాయి.
సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత.. ఫోన్ కాల్స్‌తోపాటు టైమ్ ఎంత అయిందో తెలుసుకోవచ్చు. అలాగే ఎన్ని కిలోమీటర్లు మేర నడిచామో కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఒక్కటేమిటి చాలా అంశాలు సెల్ ఫోన్‌లో ఇమిడి పోయాయి. తాజాగా కొత్త స్మార్ట్ వాచ్ గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. Huawei నుంచి వచ్చిన ఈ వాచ్‌ని అందరు ఇష్టపడే విధంగా రూపొందించారు. అలాగే ఫీచర్స్ సైతం అదిరిపోయాయి.
Huawei అధికారికంగా వాచ్ GT5 ప్రోని భారత మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. కంపెనీ దీన్ని ప్రీమియం సెగ్మెంట్‌లో విడుదల చేసింది. ప్రీమియం స్మార్ట్ వాచ్ టైటానియం ఎడిషన్‌తో పాటు బ్లాక్ ఎడిషన్.. రెండు వేరియంట్‌లలో ఇది వచ్చింది. ఈ రెండు వేరియంట్‌లు ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రసిద్ధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో లభ్యమవుతున్నాయి.
ప్రో లెవెల్ స్పోర్ట్స్ మోడ్, ECG మానిటరింగ్, GPSతో పాటు 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సహా అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాచ్ GT5 ప్రో 1.43 అంగుళాల AMOLED డిస్ ప్లేతో లభ్యమవుతోంది. ఎల్లప్పుడూ డిస్ ప్లే మోడ్‌లో స్మార్ట్‌వాచ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్ వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలో Huawei Watch GT5 ప్రో ధర:
కస్టమర్లు Huawei Watch GT 5 Pro స్పోర్ట్స్ ఎడిషన్‌ను రూ.29,999కి కొనుగోలు చేయవచ్చు, టైటానియం ఎడిషన్ ధర రూ.39,999. ఈ వాచ్ అనేక ఫీచర్లతోపాటు ప్రీమియం డిజైన్‌తో వస్తోంది.
Also Read: ఆర్టీసీ ఛార్జీలు పెంపు.. జనవరి 5 నుంచి అమలు
Huawei Watch GT 5 Pro స్పెసిఫికేషన్‌లు.. ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి..
11 కొత్త వాచ్ ఫేస్ థీమ్, ప్రో-లెవల్ స్పోర్ట్స్ ట్రాకింగ్ - గోల్ఫ్, డైవింగ్‌తోపాటు ట్రయిల్ రన్‌తో సహా 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ గుండె స్పందన రేటు, ఉష్ణోగ్రతను ట్రాక్ చేయడంలో సైతం సహాయపడుతుంది. అలాగే బేరోమీటర్ సెన్సార్, ECG తోపాటు మరిన్ని అంశాలను ఈ వాచ్ కలిగి ఉంది. స్మార్ట్ వాచ్14 రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. వాచ్‌లో అల్ట్రా-హార్డ్ కోటింగ్‌లతోపాటు నానో ఫిల్మ్ వాటర్ ప్రూఫ్ ఫినిషింగ్ సైతం ఈ వాచ్‌ల ప్రత్యేకత. ఈ వాచ్‌లు నీటిలో తడిసినా ఏం కాదు.. తుప్పు సైతం వీటికి పట్టదు. ఇక బ్లూ టూత్ కాలింగ్‌తోపాటు టెక్స్ట్ రిప్లై ఫంక్షన్‌లను సైతం కలిగి ఉంది.
Also Read: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Also Read: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్
Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు
Also Read: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్
Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ
For Business News And Telugu News
Updated Date - Jan 02 , 2025 | 09:05 PM