Congress Govt: ఆర్టీసీ ఛార్జీలు పెంపు.. జనవరి 5 నుంచి అమలు
ABN , Publish Date - Jan 02 , 2025 | 07:52 PM
Congress Govt: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ. 417 కోట్లు ఖర్చు చేస్తుంది.
బెంగళూరు, జనవరి 02: కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు రంగం సిద్ధమైంది. దాదాపు 15 శాతం మేర బస్సు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఛార్జీల పెంపు.. జనవరి 5వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. తద్వారా సంస్థకు ఒక రోజుకు రూ. 7.84 కోట్ల మేర ఆదాయం సమకూరుతోందని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఆర్టీసీ సంస్థ తీవ్ర నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
అలాంటి వేళ.. ఈ పెంచిన బస్సు ఛార్జీల ద్వారా భారీగా అదనపు ఆదాయం సమకూరనుందని సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని ఆర్టీసీకి చెందిన నాలుగు సంస్థలు.. కర్ణాటక స్టేట్ రోడ్డు కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ), కల్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషణ్ (ఎన్‌డబ్యూకేఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సంస్థలకు చెందిన బస్సులకు ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం కింది ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో తొలి వార్షికోత్సవం జరుపుకోంది. ఈ నేపథ్యంలో ప్రతి కార్పొరేషన్‌కు ఈ పథకం కింద రూ. 104 కోట్లుకు ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రభుత్వానికి ఈ పథకం కింద ప్రతి నెల రూ. 417 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ నష్టాన్ని పుడ్చుకోవడానికి 15 శాతం మేర ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: మహాకుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
ఇంకోవైపు ఈ ఛార్జీల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. పంచ భాగ్య పథకాల ముసుగులో ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర... తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రభుత్వంపై పంచ్‌లతో విజృంభించారు. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ సైతం ఈ అంశంపై ఇలా స్పందించారు.. మీరు రోజు రోజుకి ఒక్కో ధర పెంచుతూ కన్నడిగుల రక్తాన్ని పీల్చేస్తున్నారు. మీ ప్రభుత్వ దురాశతో కడుపు నింపేందుకు కన్నడిగులు ఇంకా ఎన్ని పన్నులు, ఫీజులు చెల్లించాలి? అంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Also Read: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్
Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు
Also Read: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్
Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ