Insurance: దేశంలో ఎంత మంది మహిళలకు ఇన్సూరెన్స్ ఉందో తెలుసా..
ABN, Publish Date - Mar 07 , 2025 | 09:35 PM
దేశంలో మహిళలు బీమా రంగంలో మరింత చురుకుగా పాల్గొంటున్నట్లుగా ఓ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బీమా పథకాల ద్వారా వారు తమ భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను పెంచుకుంటున్నారని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళల గురించి ఓ సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మహిళలు గతంలో గంటే చాలా మార్పు చెందారని చెప్పవచ్చు. తమ ఆర్థిక భద్రతను పెంచుకోవడంతోపాటు మరింత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించారు. ఇదే సమయంలో బీమా పథకాలను కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు పాలసీబజార్ నివేదిక తెలిపింది. మహిళలు ఇప్పుడు తమ భవిష్యత్తు రక్షణ కోసం రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని ఎంచుకుంటున్నట్లు రిపోర్ట్ తెలిపింది.
మహిళల బీమాలో భాగస్వామ్యం
పాలసీ బజార్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే మహిళల శాతం 18%కి పెరిగింది. బీమా కొనుగోలు చేసే మహిళల్లో జీతం పొందే మహిళలు 49% వాటాతో ముందంజలో ఉన్నారు. ఆ తరువాత గృహిణులు 39%తో ఉన్నారు. ఈ గణాంకాలు మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా వేగంగా దూసుకెళ్తున్నారని నివేదిక వెల్లడించింది. దీంతోపాటు టర్మ్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెరిగేందుకు, మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వనరులు కూడా పెరిగాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా మహిళలు మరింత ఆర్థికంగా సాధికారత పొందే అవకాశాలను కల్పిస్తున్నాయి.
జీతం పొందే మహిళలు vs స్వయం ఉపాధి పొందే మహిళలు
జనాభా పరంగా టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే మహిళల్లో అత్యధికులు జీతం పొందే మహిళలు ఉన్నారు. వారి వాటా మొత్తం కొనుగోళ్లలో 49%గా ఉంది. ఇది మహిళల వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కొత్త ధోరణిని చూపిస్తుంది. గృహిణులు 39%తో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. తరచూ తమ పిల్లల భవిష్యత్తు భద్రత కోసం ఈ రకాల పాలసీలను ఎంచుకుంటున్నారు. స్వయం ఉపాధి పొందే మహిళలు 12% చొప్పున ఉండగా, వీరు ఫ్రీలాన్సర్లు లేదా ఇతర వ్యాపారాలు చేస్తున్నారు.
వయస్సు ఆధారంగా చూస్తే..
టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులలో 18-30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 41% వాణిజ్యపరమైన వాటాను కల్గి ఉన్నారు. ఇది యువతలో ఆర్థిక భద్రతపై పెరుగుతున్న అవగాహనను సూచిస్తుంది. 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 48% వాటాతో ముందంజలో కలరు. వివాహం, మాతృత్వం, ఇంటి యాజమాన్యం వంటి కీలక దశల్లో వారు టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చారు. 41-50 సంవత్సరాల వయస్సు గల వారు 10% వాటాతో ఉన్నారు. వీరు ఎక్కువగా వారసత్వ ప్రణాళిక, ఆదాయ రక్షణపై ఫోకస్ చేశారు.
కవరేజీ ఎంపికలు
ఇటీవల గణాంకాలు ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎక్కువ సంఖ్యలో మహిళలు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని ఎంచుకున్నారు
49% మంది వ్యక్తులు రూ. 50 లక్షల నుంచి రూ. 99 లక్షల కవరేజీని ఎంచుకున్నారు
34% మంది రూ. 1 కోటి నుంచి రూ. 1.99 కోట్ల మధ్య కవరేజీని తీసుకున్నారు
10% మంది రూ. 2 కోట్లకు పైగా కవరేజీని ఎంపికచేసుకున్నారు. వీరు ప్రధానంగా అధిక ఆదాయ నిపుణులు, వ్యాపార యజమానులు
ఆరోగ్య బీమా విషయానికి వస్తే 2023లో మహిళలు 15% తీసుకోగా, 2025లో ఇది 22%కు పెరిగే అవకాశం ఉందని అంచనా
ఇవి కూడా చదవండి:
YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Swiggy: ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..
Toyota: టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
H 1B Visa: హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఫీజు, గడువు వివరాలివే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 07 , 2025 | 09:38 PM