YouTube: 9.5 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణమిదే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:16 PM
యూట్యూబ్ ఎప్పటికప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో వీడియోల పోస్టింగ్, కంటెంట్ రూల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పలు రకాల నియామాలను పాటించలేదని ఏకంగా 95 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది.

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్ నుంచి ఏకంగా 9.5 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. కంటెంట్ ఉల్లంఘన సహా పలు కారణాలతో ఆ వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ వీడియోలు గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ 2024 మధ్య యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యాయి. అయితే యూట్యూబ్ నుంచి తొలగించిన వీడియోలలో ఎక్కువ భాగం భారతీయ సృష్టికర్తలే అప్‌లోడ్ చేసినవి ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తొలగించబడిన వీడియోల గరిష్ట సంఖ్య
ఈ వీడియోలు తమ కంటెంట్ నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని యూట్యూబ్ వెల్లడించింది. తొలగించబడిన వీడియోలలో గరిష్ట సంఖ్యలో అంటే 3 మిలియన్లు భారతీయ సృష్టికర్తలవి రిమూవ్ చేశారు. ఈ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ తొలగించిన చాలా వీడియోలలో ద్వేషపూరిత ప్రసంగం, పుకార్లు, వేధింపుల వంటివి ఉన్నాయని, ఇవి కంటెంట్ విధానాలకు విరుద్ధమని యూట్యూబ్ వెల్లడించింది.
వీడియోల్లో పిల్లలు..
ఈ ప్లాట్‌ఫామ్‌ను పారదర్శకంగా ఉంచడానికి YouTube ఒక AI ఆధారిత గుర్తింపు వ్యవస్థను ఉపయోగించింది. ఇది ప్లాట్‌ఫారమ్‌లోని అటువంటి వీడియోలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటుంది. యూట్యూబ్ నుంచి తొలగించబడిన 5 మిలియన్ల వీడియోలలో చాలా వరకు పిల్లలను చూపించారు. ఇది కంపెనీ కంటెంట్ విధానానికి విరుద్ధం. కొన్ని వీడియోలలో ప్రమాదకరమైన విన్యాసాలు, పిల్లలను వేధించడం వంటివి కూడా ఉన్నాయి.
48 లక్షల ఛానెళ్ల తొలగింపు
ఈ క్రమంలో యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్ నుంచి అనేక వీడియోలను తొలగించడమే కాకుండా, కంపెనీ 4.8 మిలియన్లకుపైగా ఛానెల్‌లను అంటే 48 లక్షల ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్‌ల ద్వారా స్పామ్ లేదా మోసపూరిత వీడియోలు అప్‌లోడ్ చేయబడుతున్నాయని వెల్లడించింది. YouTubeలో ఒక ఛానెల్ తీసివేస్తే, ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోలు కూడా తొలగించబడతాయి. ఆ ఛానెల్ పై తీసుకున్న చర్య కారణంగా, దాదాపు 5.4 మిలియన్లు అంటే 54 లక్షల వీడియోలు తొలగించబడ్డాయి.
ఎప్పటికప్పుడు చర్యలు
యూట్యూబ్‌ను వినియోగదారులు పారదర్శకంగా, సురక్షితమైన వీడియో ప్లాట్‌ఫామ్‌గా ఉంచుకోవడానికి ఎప్పటికప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటుందని గూగుల్ తెలిపింది. వినియోగదారులు వీడియోలను అప్ లోడ్ చేసిన తర్వాత AI ఆధారిత గుర్తింపు సాధనాలతో పాటు కంపెనీ వాటిని విశ్లేషిస్తుంది. ఆ తరువాత వాటిని ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగిస్తారని గూగుల్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Swiggy: ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..
Toyota: టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
H 1B Visa: హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఫీజు, గడువు వివరాలివే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News