Unique Business Plan: కొబ్బరి వ్యర్థాలతో వ్యాపారం.. కోట్లలో ఆదాయం..
ABN, Publish Date - Feb 27 , 2025 | 02:30 PM
Low Investment Business Idea: కొబ్బరికాయ పీచు, టెంకలను ఎవరైనా ఏం చేస్తారు. వాటినేం చేసుకుంటాం చెత్తలో వేస్తాం అంటారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం కొత్తగా ఆలోచించాడు. ఆ పనికిరాని వ్యర్థాలతోనే వ్యాపారం మొదలుపెట్టి కోట్లు సంపాదించాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా. ఎందుకంటే ఇది పోటీలేని బిజినెస్ మరి..
Unique Low Investment Business Idea: అందరికంటే భిన్నంగా ప్రయత్నించాలని మనసులో ఉన్నా ఆలోచన దగ్గరే ఆగిపోతారు చాలామంది. మరీ ముఖ్యంగా వ్యాపారం విషయంలో. కాస్త అటు ఇటూ అయినా పెట్టుబడి గాలిలో కలిసిపోతుందనే భయమే కారణం. కానీ, చెన్నైకి చెందిన అనీస్ అహ్మద్ తనకు తట్టిన ఆలోచనను అమలులో పెట్టేందుకు ఏ మాత్రం సంకోచించలేదు. పనికిరాని కొబ్బరివ్యర్థాలను ఎన్ని రకాలుగా వాడవచ్చో శోధించి సాధించాడు. తెలివితేటలు ఉపయోగిస్తే చెత్తనైనా కోట్లుగా మలచవచ్చని నిరూపించాడు. ఈ వ్యాపారం చేయాలంటే..
ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్..
కొబ్బరికాయ పగులగొట్టాక అందులోని నీరు, కొబ్బరిని తీసుకుని మిగిలిన టెంక, పీచు పడేస్తుంటాం. కానీ, ఈ వ్యర్థాలతో ఎన్నో రకాల ఉత్పత్తులు తయారుచేయవచ్చని మీకు తెలుసా. ముఖ్యంగా కొబ్బరి పెంకుతో తయారుచేసే కోకోపీట్ భూమిని సారవంతం చేసేందుకు ఉపయోగపడుతుంది. కొబ్బరి వ్యర్థాలను శుద్ధిచేసి, ఎండబెట్టి కోకోపీట్ తయారు చేస్తారు. దీంతో తయారుచేసే కుండలు, గ్రో బ్యాగ్స్, ఇటుకలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. అలాగే కొబ్బరిపీచుతో తయారుచేసే తాళ్లను మార్కెటింగ్ చేసుకుంటే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఈ విషయాలన్నీ అధ్యయనం చేశాక.. స్థానిక రైతులతో డీలింగ్ కుదుర్చుకుని తక్కువ పెట్టుబడితోనే 'గ్లోబల్ గ్రీన్ కాయిర్' స్టార్టప్‌ను దాదాపు రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేర్చగలిగాడు అనీస్ అహ్మద్.
కోకోపీట్ తయారీ విధానం..
నాణ్యమైన కోకోపీట్ ఉత్పత్తికి గ్లోబల్ గ్రీన్ కాయిర్ ఈ కింది ప్రక్రియను అనుసరించాలి.
సేకరణ, విభజన: కొబ్బరి పొట్టును స్థానిక పొలాల నుంచి సేకరించి ఫైబర్స్, ఆకులు వంటి వ్యర్థాలను తొలగించాలి.
కడగడం, ఎండబెట్టడం: కలుషితాలను తొలగించడానికి పొట్టును కడగాలి. తరువాత తేమ ఆరిపోయేవరకూ బాగా ఎండలో ఆరబెట్టి పొడిగా చేస్తారు.
ప్రాసెసింగ్, ప్యాకేజింగ్: ఎండిన పొట్టును కోకోపీట్ ఇటుకలు, బ్లాక్‌లు లేదా వదులుగా ఉండే పీట్‌గా ప్రాసెస్ చేసి ఎగుమతి కోసం ప్యాక్ చేస్తారు.
కొబ్బరి పీచు అమ్మి నెలకు రూ.60వేలు..
కొబ్బరి పీచుతో తాళ్లను తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రాలు లభిస్తాయి. మార్కెటింగ్ చేయడం కూడా చాలా సులభం. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యాపారం చేస్తూ ఈజీగా నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడంటేనే కొబ్బరి తాళ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. యంత్రాలు, తదితర ఖర్చుల కోసం లోన్ తీసుకుని రూ.20లక్షల వరకూ పెట్టుబడి పెట్టి.. అన్ని ఖర్చులు పోనూ లక్ష వరకూ సంపాదిస్తున్నాడు.
Read Also : బెంగళూరు రోడ్లపై రెచ్చిపోయిన ప్రేమజంట.. వారి చేష్టలకు.. బాబోయ్..
హోమ్ లోన్ కావాలా.. అయితే ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీ రేట్లు ఇక్కడే..
ఈ 3 రోజుల్లో తలస్నానం చేస్తే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది..
Updated Date - Feb 27 , 2025 | 02:47 PM