Gold And Silver Prices Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
ABN, Publish Date - Feb 02 , 2025 | 07:09 AM
ఆదివారం(02-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,600 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.84,640కు చేరుకుంది.
బిజినెస్ డెస్క్: బంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. ఆదివారం(02-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,600 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.84,640కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.77,450 ఉండగా.. 24 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.84,490కు చేరింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ 22 క్యారెట్ల 10 పుత్తడి ధర రూ.77,450 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.84,490గా ఉంది.
వెండి ధరలు ఇలా..
అలాగే వెండి ధర సైతం భారీగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,500కు చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి ధర రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది.
ప్రధాన నగరాల్లో పరిస్థితి ఇది.. (22, 24 క్యారెట్ల ధరలు)
కోల్‌కతా- రూ.77,450, రూ.84,490
చెన్నై- రూ.₹77,450, రూ.84,490
జైపూర్- రూ.77,600, రూ.84,640
భువనేశ్వర్- రూ.77,450, రూ.84,490
బెంగళూరు- రూ.77,450, రూ.84,490
ఢిల్లీ- రూ.77,600, రూ.84,640
హైదరాబాద్- ధర రూ.77,450, రూ.84,490
ముంబై- రూ.77,450, రూ.84,490
Updated Date - Feb 02 , 2025 | 07:22 AM