ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viveka Murder Case: జైలులో దస్తగిరిని చైతన్యరెడ్డి కలిశారు

ABN, Publish Date - Feb 11 , 2025 | 06:15 AM

డ్రైవర్‌ దస్తగిరిని కడప సెంట్రల్‌ జైలులో డాక్టర్‌ దేవిరెడ్డి చైతన్యరెడ్డి కలిసింది వాస్తవమేనని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి విచారణ

  • విచార ణ అధికారికి తెలిపిన బీటెక్‌ రవి

  • జైల్లో నా బ్యారక్‌ ఎదురుగా దస్తగిరి ఉండేవాడు

  • ఆ బ్యారక్‌కు చైతన్యరెడ్డి వెళ్లడం చూశాను

  • లిఖితపూర్వకంగా వివరాలు ఇచ్చిన బీటెక్‌ రవి

కడప, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరిని కడప సెంట్రల్‌ జైలులో డాక్టర్‌ దేవిరెడ్డి చైతన్యరెడ్డి కలిసింది వాస్తవమేనని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి విచారణ అధికారి రాహుల్‌ శ్రీరాంకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. తనను బెదించారంటూ ఇటీవల నలుగురిపై దస్తగిరి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రాహుల్‌ శ్రీరాం కడప సెంట్రల్‌ జైలులో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలుత బాధితుడు దస్తగిరిని, తరువాత నిందితులు డాక్టర్‌ చైతన్యరెడ్డి, జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్‌ను, సిబ్బందిని విచారించారు. దస్తగిరి కడప సెంట్రల్‌ జైల్లో ఉన్నపుడు ఆ సమయంలో రిమాండులో ఉన్న వారిని విచారణ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులపై దౌర్జన్యం చేశారన్న కేసులో బీటెక్‌ రవిని 2023 నవంబరు 14న పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులపాటు రిమాండులో ఉంచారు. అదే సమయంలో దస్తగిరి ఎస్‌ఎ్‌సఆర్‌ బ్యారక్‌లో ఉండగా.. ఆ ఎదురుగా ఉన్న బ్యారక్‌లోనే బీటెక్‌ రవి కూడా ఉండేవారు. ఈ నేపథ్యంలో బీటెక్‌ రవిని రాహుల్‌ శ్రీరాం సోమవారం విచారించారు. ‘‘ ఏ కేసులో అరెస్టు చేశారు? ఏ బ్యారక్‌లో ఉన్నారు? చైతన్యరెడ్డి ఎస్‌ఎ్‌సఆర్‌ బ్యారక్‌లోకి ప్రవేశించడం చూశారా?’’ అంటూ వాట్సాప్‌ ద్వారా రవిని కోరగా.. ఆయన లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.

ముగ్గురు డాక్టర్లతో కలసి వచ్చారు

ఎస్‌ఎస్ఆర్‌ బ్యారక్‌లోకి డాక్టర్‌ చైతన్యరెడ్డి ముగ్గురు డాక్టర్లతో కలిసి వెళ్లడం చూసినట్లు రవి చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కొడుకు చైతన్యరెడ్డిని.. అదే కేసులో అప్రూవరైన దస్తగిరి బ్యారక్‌లోకి పంపడం సరైంది కాదంటూ అప్పుడు కొందరు అధికారులతో తనతో చెప్పినట్లు తెలిపారు. దస్తగిరి ఉన్న బ్యారక్‌ నిషేధిత ప్రాంతమని, ఈ మేరకు అక్కడ బోర్డు పెట్టడంతో పాటు అతనిపై నిఘా ఉంచారని తెలిపారు.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 06:15 AM