ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool : ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలకు సిద్ధంకండి

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:58 AM

కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరిగే విరసం (విప్లవ రచయితల సంఘం) 24వ సాహిత్య పాఠశాల వేడుకలు...

  • విరసం సభలో వక్తల పిలుపు

  • కర్నూలులో ఘనంగా ఆరంభమైన విరసం పాఠశాల

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): హిందూత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలకు సాహిత్యకారులు, బుద్ధి జీవులు సిద్ధంగా ఉండాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరిగే విరసం (విప్లవ రచయితల సంఘం) 24వ సాహిత్య పాఠశాల వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల దివంగతులైన ప్రొఫెసర్‌ సాయిబాబా స్మృతిపథంలో సాహిత్య పాఠశాల ప్రాంగణానికి కామ్రేడ్‌ సాయిబాబా ప్రాంగణంగా నామకరణం చేశారు. ‘సంక్షోభకాలంలో సాహిత్యకారుల పాత్ర’ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో భాగంగా తొలుత విరసం నాయకులు పతాక ఆవిష్కరణ చేశారు. విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ ప్రారంభోపన్యాసం చేస్తూ విప్లవ మేధావి జీఎన్‌ సాయిబాబా తన జీవితంలో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపై సంధించిన చురుకైన ప్రశ్నలు ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకువచ్చాయని చెప్పారు. ప్రొఫెసర్‌ సాయిబాబా సహచరి వసంత కుమారి మాట్లాడుతూ సాయిబాబా గొప్ప అధ్యయనశీలి అని, ఆయన ప్రతిపనినీ ప్రణాళికతో చేసేవారని చెప్పారు. రెండో సెషన్‌లో శివరాత్రి సుధాకర్‌ అధ్యక్షత వహించగా, ‘మేథో సృజన రంగాలపై ఫాసిస్టుల దాడి-కార్పొరేట్‌ ప్రయోజనాలు’ అనే అంశంపై అల్ల రాజయ్య ప్రసంగించారు.


ఫాసిస్ట్‌ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జరిగిన ‘సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో రచయితల దృక్పథాలు, వైఖరులు’ అనే అంశంపై జరిగిన సభ ను ఉజ్వల్‌, సీఎ్‌సఆర్‌ ప్రసాద్‌ నిర్వహించగా, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్‌, కవులు స్కైబాబా, మెర్సీ తదితరులు మాట్లాడుతూ సంఘ్‌ పరివార్‌ ఏడు రకాల ఎత్తుగడల్ని అవలంబిస్తోందని, ప్రాచీన దేశ చరిత్ర ఘనమైనదని చెప్పడం, హిందువులుగా గుర్తించిన వారిని ఒక గొడుగు కిందకి చేర్చడం చేస్తోందన్నారు. ఈ సభలో వీక్షణం సంపాదకులు ఎన్‌.వేణుగోపాల్‌, విరసం కార్యదర్శి రివేరా, విరసం నేతలు పాణి, అరుణ్‌, వరలక్ష్మి, శశికళ, నాగేశ్వరాచారి, అరుణోదయ అధ్యక్షురాలు విమల, అరుణోదయ కళాకారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 04:58 AM