ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijaya Dairy : ఆరుపదుల.. ‘విజయ’ ప్రస్థానం!

ABN, Publish Date - Feb 11 , 2025 | 05:39 AM

దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోని ‘విజయ’ డెయిరీ వజ్రోత్సవ వేడుకలకు సన్నద్ధమైంది.

  • 84 రకాల పాల ఉత్పత్తులతో దక్షిణ భారత్‌లోనే టాప్‌

  • నేడు విజయవాడలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ వజ్రోత్సవం

విజయవాడ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోని ‘విజయ’ డెయిరీ వజ్రోత్సవ వేడుకలకు సన్నద్ధమైంది. మంగళవారం విజయవాడ చిట్టినగర్‌లోని డెయిరీ ప్రధాన కేంద్రంలో వేడుకలు జరగనున్నాయి. విజయ డెయిరీ రోజుకు 11 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తూ రూ.1200 కోట్ల టర్నోవర్‌ కలిగి రెండు లక్షల మంది పాడి రైతులకు జీవనాధారంగా ఉంది. దక్షిణ భారతదేశంలోనే 84 రకాల పాల ఆధారిత ఉత్పత్తులతో నంబర్‌ వన్‌గా ఉంది. పాడి రైతులకు నాలుగు నెలలకోసారి బోనస్‌ ఇవ్వటం, సభ్యులకు లాభాలను పంపిణీ చేయటం, పాడి రైతులకు సంక్షేమ పథకాలను వర్తింపచేయటం, ప్రత్యక్షంగా, పరోక్షంగా వే లాది మందికి ఉపాధి కల్పించటం డెయిరీ ప్రత్యేకత. ఇంతింతై వటుడింతైన చందాన.. ‘విజయ’ ప్రస్థానం వజ్రోత్సవానికి చేరింది.


పాడిపరిశ్రమ అభివృద్ధికి బీజం ఇలా..!

తొలుత యూనిసెఫ్‌ సహకారంతో నాలుగు మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు, మిల్క్‌ పౌడర్‌ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొట్టమొదటి చిల్లింగ్‌ సెంటర్‌ పామర్రులో 1965 ఫిబ్రవరి 11న ప్రారంభమైంది. అదే తర్వాతి కాలంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డైరీ)గా రూపాంతరం చెందింది. పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ముందుకు సాగుతోంది. నేటికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రారంభమై 60 ఏళ్లవుతోంది. పాలసేకరణలో రోజుకు 10 లక్షల లీటర్ల మైలురాయిని చేరి దేశంలోనే ప్రఽథమస్థానంలో నిలిచింది కృష్ణామిల్క్‌ యూనియన్‌. రూ.600 కోట్ల టర్నోవర్‌ను ఐదేళ్లలోనే రూ.1200 కోట్లకు చేర్చిన ఘనత ఈ పాలకవర్గానిదే. గత సెప్టెంబరులో వరదల వల్ల విజయవాడ పాల ఫ్యాక్టరీ 45 రోజులు మూతపడ్డా వినియోగదారులకు సకాలంలో పాల ఉత్పత్తులు అందించడం వీరవల్లి ఫ్యాక్టరీ వల్లే సాధ్యమయింది. విదేశాల్లోని సాంకేతికతను పాడిరైతులకు చేరువ చేసేందుకు తానా లాంటి సంస్థల సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతోంది.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 05:39 AM