Anaparthi: ప్రాణం తీసిన లిఫ్ట్
ABN, Publish Date - Feb 11 , 2025 | 05:27 AM
అపార్టుమెంట్ లిఫ్ట్‌లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అనపర్తికి చెందిన కసిమేడ సూర్యనారాయణ(54) అనపర్తి పాతవూరిలోని తన కుమారుడు నివాసం..
అనపర్తి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అపార్టుమెంట్ లిఫ్ట్‌లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. అనపర్తికి చెందిన కసిమేడ సూర్యనారాయణ(54) అనపర్తి పాతవూరిలోని తన కుమారుడు నివాసం ఉంటున్న అపార్టుమెంటుకు వచ్చాడు. కుమారుడు ఆస్పత్రి పనిమీద బయటికి వెళ్లడంతో సూర్యనారాయణ తిరిగి కిందికి వచ్చే క్రమంలో నాలుగో ఫ్లోర్‌లో లిఫ్ట్ డోర్ తీసి ఉన్నది చూసుకోకుండా లోపలికి అడుగువేశాడు. అయితే, అప్పటికే లిఫ్ట్ క్యాబిన్ మూడో ఫ్లోర్‌లో ఉండడం, సూర్యనారాయణ లిఫ్ట్ నాలుగో ఫ్లోర్ నుంచి క్యాబిన్‌పైకి ఒక్కసారిగా జారిపోవడం, డోరు లాక్ అవడం ఒకేసారి జరిగాయి. అదే సమయంలో మూడో ఫ్లోర్‌లో ఒకరు లిఫ్ట్‌ను ఆపరేట్ చేయగా లిఫ్ట్ కిందకు రావడంతో సూర్యనారాయణ చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
Updated Date - Feb 11 , 2025 | 05:27 AM