ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంతకం కోసమే అసెంబ్లీకి: బీటెక్‌ రవి

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:14 AM

టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కేవలం సంతకం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు.

ABN AndhraJyothy : పులివెందుల టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కేవలం సంతకం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. వైఎస్‌ జగన్‌ అవగాహన లోపం వల్ల రూ.వేల కోట్లు ఖర్చు చేసినా పులివెందుల ప్రాంతంలో తాగు నీరు, రోడ్లు సమస్యలు న్నాయి. అవి చర్చించేందుకు అసెంబ్లీకి వస్తారని ఆశించా. కానీ ఏదో లోటస్‌ పాండ్‌కు వచ్చినట్లుగా అసెంబ్లీకి వచ్చి అరగంటలోనే ప్రతిపక్ష హోదా డ్రామాతో వెళ్లిపోయారు. రాజ్యాంగంలోని విఽధి విధానాల ప్రకారమే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. నీ కోసం రాజ్యాంగం మార్చాలా?’ అని ప్రశ్నించారు. అధికారం పోవడంతో ఎంపీ అవినాశ్‌రెడ్డికి మతిభ్రమించింది. ఆయన... సునీత, షర్మిల ఫొటోలు పెట్టుకుని పూజించాలి. వారు లేకుంటే ఓడిపోయే వారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం తఽథ్యం. అప్పుడు మీకు ప్రజా వ్యతిరేకత అర్థమవుతుంది’ అని అన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 05:15 AM