ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: అనుమానాస్పదం

ABN, Publish Date - Mar 08 , 2025 | 04:16 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో చనిపోతుండటాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటూ ఆయన, ఈ కేసులో ప్రధాన సాక్షి, వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న మృతిని ప్రస్తావించారు. సచివాలయంలో శుక్రవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. వివేకా హత్య తదనంతర పరిణామలపై మంత్రులతో సీఎం చ ర్చించారు.

Ranganna Died

వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షుల మరణాలను తేలిగ్గా తీసుకోకూడదు

రంగన్న మృతిపై నిగ్గు తేల్చాల్సిందే

పరిటాల కేసు తరహాలోనే ఇక్కడా మిస్టరీ మరణాలు

కేబినెట్‌ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రంగన్నను పోలీసులే చంపారని జగన్‌ మీడియాలో ఎందుకని తొలుత ప్రసారం చేశారు?

ఆయన మృతిని సర్కారుపైకి నెట్టే కుట్రే ఇది

వ్యవస్థీకృత నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రాజకీయాలను నేరపూరితం చేసిన జగన్‌

సమాజాన్ని ఏమార్చేందుకే టీవీ,పత్రిక ఏర్పాటు

వీరిని అదుపు చేయకపోతే ప్రమాదం: సీఎం

వివేకా హత్య అనంతర పరిణామాలు వివరించిన డీజీపీ

హత్యా రాజకీయాలకు చెక్‌ పెట్టాలి: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలను పూర్తిగా నేరమయం చేసేలా అధునాతన విధానంలో నేరాలకు పాల్పడుతున్నారని, రాజకీయాల్లో వ్యవస్థీకృత నేరాలు చేసేవారిని అదుపు చేయకపోతే మొత్తం వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో చనిపోతుండటాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటూ ఆయన, ఈ కేసులో ప్రధాన సాక్షి, వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న మృతిని ప్రస్తావించారు. సచివాలయంలో శుక్రవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. వివేకా హత్య తదనంతర పరిణామలపై మంత్రులతో సీఎం చ ర్చించారు. వివేకా హత్య జరిగిన నాటి నుం చి చోటుచేసుకున్న పరిణామాలను, వివేకా కేసులో కీలక వ్యక్తులు వరుసగా మృతి చెం దుతున్న తీరును, ఆ మరణాల వెనుక ఉన్న అనుమానాలను మంత్రులకు డీజీపీ హరీశ్‌గుప్తా వివరించారు. చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు మీడియాలో వస్తున్న వార్తలు చూసి గుండెపోటని అనుకున్నాం. హత్య జరిగిన రోజున హైదరాబాద్‌లో ఉన్న జగన్‌కు ఉదయం 5 గంటలకే విషయం తెలిసినా ఏమాత్రం చలించకుండా అజయ్‌ కల్లం తదితరులతో కలిసి వైసీపీ మేనిఫెస్టో తయారీలో నిమగ్నమైపోయారు. సొంత చిన్నాన్న చనిపోతే అంత కూల్‌గా ఎవరైనా ఉండగల రా? మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి అర్ధరాత్రి ఎప్పుడో హత్యకు గురైతే ఉదయం 10.30 గంటల వరకూ ఎస్పీతోసహా పోలీసు ఉన్నతాధికారులు ఎవ్వరూ అక్కడికి వెళ్లలేదు. ఇప్పుడేమో ఈ కేసులో కీలక వ్యక్తులు, సాక్షు లు వరుసగా అనుమానాస్పదరీతిలో మరణిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే ఎంత పక్కాగా వివేకా హత్య జరిగిందో అర్థమవుతోంది. ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీనిగ్గుతేల్చాల్సిందే’’ అని సీఎం అన్నారు.



జగన్‌ అరాచకాలు తిప్పికొట్టాలి

వివేకా హత్య, జగన్‌ కుట్ర రాజకీయాలు, సొంత మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులకు సీఎం వివరిస్తూ.. రాజకీయాల ముసుగులో కరుడుగట్టిన నేరగాళ్లు రాష్ట్రంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలను మాజీ సీఎం జగన్‌ నేరపూరితంగా మార్చేశారన్నా రు. ప్రజలను ఏమార్చేందుకు జగన్‌ సొం తంగా టీవీ, పత్రిక ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. జగన్‌ చేస్తున్న అరాచకాలను తిప్పి కొట్టాలని మంత్రులకు సూచించారు. స్వప్రయోజనాల కోసం వివేకాను హత్య చేసి ఎన్నికల సమయం కావడంతో దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు తనపై నీచమై న ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘‘నేను వివేకాను హత్య చేసినట్లు వాళ్ల పత్రికలో ‘నా రాసుర రక్తచరిత్ర’ అం టూ రాసుకొచ్చారు. ముందు గుండెపో టు అని చెప్పి, తర్వాత గొడ్డలి వేటన్నారు.వివేకా హత్యపై ఎవ్వరూ మాట్లాడకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. చివరికి బాధితురాలైన చెల్లెలు సునీతను నిందితురాలిగా చూపించేందుకు జగ న్‌ ప్రయత్నించారు.’’ అని వివరించారు. ఇలాంటి నేర మనస్తత్వం ఉన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వా రు చేసే ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. వివేకా హత్య సమయంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు వైసీపీ అధికారంలోకి రాగానే పదోన్నతులు కల్పించడం, సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఎదురుకేసు పెట్టడం.. అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయనివ్వకుండా అడ్డుకోవడం వంటి అంశాలన్నిటినీ వివరిస్తూ.. జగన్‌ నేర మనస్తత్వాన్ని విశ్లేషించారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులోనూ కీలక వ్యక్తులందరూ వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెం దారని గుర్తుచేశారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్‌, భారతిని హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్‌ కూడా చనిపోవడంపై చర్చ జరిగింది.



జగన్‌ మీడియా ఉన్నదే అందుకు...

రంగన్న మృతిని మసిపూడి మారేడుకాయ చేసేందుకు జగన్‌ మీడియా ప్రయత్నించిందని సీఎం అన్నారు. పోలీసులు చం పారంటూ తొలుత జగన్‌ మీడియాలో ప్రసారం కావడం గురించి మంత్రివర్గ సహచరులకు ఆయ న వివరించారు. ఏ దురుద్దేశం లేకపో తే జగన్‌ మీడియా లో రంగన్న మృతి ని పోలీసుల మెడ కు చుట్టాలని ఎందు కు చూస్తారని, ఆయన మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. జగన్‌ మీడియా ఉన్నదే అందుకు.. అన్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై కూడా కేబినెట్‌లో చర్చించారు. రంగన్నకు 1+1 భద్రత ఉన్నా కూడా రక్షించలేకపోయామని మంత్రులు వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు సీబీఐ పరిధిలో ఉన్నా, ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, అప్రూవర్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మంత్రులు అభిప్రాయపడ్డారు.

చెక్‌ పెట్టాల్సిందే..

వివేకా హత్య కేసులో కీలకవ్యక్తులు వరుసగా అనుమానాస్పదరీతిలో మృతి చెందడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హత్యారాజకీయాలు పునరావృతం కాకుండా చెక్‌ పెట్టాల్సిందేనన్నారు. ఈ మరణాలను సీరియ్‌సగా తీసుకోకపోతే మరొకరు ఇదే తరహాలో తయారవుతారని పవన్‌ అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..

Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 10:01 AM