Minister Sathyakumar Yadav : బోదకాలు నివారణకు కృషి
ABN, Publish Date - Feb 11 , 2025 | 06:37 AM
ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో 40,877 మంది వ్యాధిగ్రస్తులు: మంత్రి సత్యకుమార్
అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): బోదకాలు వ్యాధి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బోదకాలు వ్యాధిగ్రస్తులకు సామూహిక మందుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 2030 నాటికి బోదకాలు వ్యాధి విస్తరణను అరికట్టే కార్యక్రమంలో భాగంగా సోమవారం 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో ఈ వ్యాధి నివారణ మందుల పంపిణీని చేపట్టారు. ఆయా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - Feb 11 , 2025 | 06:38 AM