Alluri District : జి.మాడుగులలో 4.7 డిగ్రీలు
ABN, Publish Date - Jan 21 , 2025 | 05:48 AM
మన్యంలో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
విశాఖపట్నం, పాడేరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గూడెంకొత్తవీధిలో 5.5, పెదబయలులో 5.8, డుంబ్రిగుడలో 6, పాడేరులో 6.1, అరకులోయలో 6.6, చింతపల్లిలో 7, ముంచంగిపుట్టులో 7.8, హుకుంపేటలో 8.3, అనంతగిరిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటల వరకూ పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. ఉత్తరకోస్తా, తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా ప్రాంతాల్లో చలి కొనసాగింది. దీనికితోడు మంచు కురుస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల చలి ప్రభావం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Updated Date - Jan 21 , 2025 | 05:48 AM