ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SC categorization : ఎస్సీ వర్గీకరణపై పోటెత్తిన వినతులు

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:04 AM

ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్‌, అది రాజ్యాంగ విరుద్ధమంటూ మాలమహానాడు, దాని అనుబంధ సంఘాలు పోటాపోటీగా నినదించాయి.

  • నినాదాలతో దద్దరిల్లిన ప్రకాశం కలెక్టరేట్‌

  • వినతులు స్వీకరించిన కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా

ఒంగోలు నగరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్‌, అది రాజ్యాంగ విరుద్ధమంటూ మాలమహానాడు, దాని అనుబంధ సంఘాలు పోటాపోటీగా నినదించాయి. కొన్ని కులాల వా రు అనుకూలంగా, మరికొన్ని కులాల వారు వ్యతిరేకంగా వందల సంఖ్య లో ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ వద్ద మోహరించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనం(కలెక్టరేట్‌) స్పందన హాలులో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వందల సంఖ్యలో ఎస్సీలు అక్కడ మోహరించారు. అంతకుముందు నగరంలో పోటాపోటీగా ప్రదర్శనలు నిర్వహించి, మధ్యాహ్నానికి ఇరువర్గాలు కలెక్టరేట్‌కు చేరుకొని నినాదాలు హోరెత్తించాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని.. తోపులాట చోటు చేసుకుంది. జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. అయినప్పటికీ ఇరువర్గాలు కమిషన్‌కు గోడు వినిపించేందుకు పోటీ పడ్డాయి.


ఇది రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు, దాని అనుబంధ సంఘాలు చెప్పగా, ఎమ్మార్పీఎ్‌సలోని రెండు వర్గాలు ఎస్సీ వర్గీకరణతోనే ఉపకులాల అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇరువర్గాలు కమిషన్‌ చైర్మన్‌ ముం దు తమ వాదనలను బలంగా వినిపించాయి. మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్దఎత్తున ఉద్యోగులు తరలివచ్చి చైర్మన్‌కు వినతిపత్రాలను అందజేశారు. ఎస్సీలకు ఉమ్మడి రిజర్వేషన్‌ పెంచాలని, అంబేడ్కర్‌ పేరుతో బ్యాంకు ఏర్పాటు చేసి రుణాలు అందజేయాలని కోరారు.

Updated Date - Jan 07 , 2025 | 04:04 AM