Anakapalli : కచిడి 14 కిలోలు.. రూ.28 వేలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 04:24 AM
మత్స్యకారుని గేలానికి అత్యంత అరుదైన ‘కచిడి’ చేప చిక్కింది. పూడిమడక మత్స్యకారులకు సోమవారం వంజరం, రాయి చేపలు పడగా..
ABN AndhraJyothy : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలారిపాలేనికి చెందిన మత్స్యకారుని గేలానికి అత్యంత అరుదైన ‘కచిడి’ చేప చిక్కింది. పూడిమడక మత్స్యకారులకు సోమవారం వంజరం, రాయి చేపలు పడగా, జాలారిపాలేనికి చెందిన మత్స్యకారునికి ‘కచిడి’ చేప చిక్కింది. 14 కిలోల బరువు ఉన్న ఈ చేపను ఒక వ్యాపారి 28 వేలకు కొన్నారు. ఔషధ గుణాలుండడంతో ఈ చేపకు అంత ధర పలికిందని మత్స్యకారులు తెలిపారు.
- అచ్యుతాపురం, ఆంధ్రజ్యోతి
Updated Date - Feb 04 , 2025 | 04:24 AM